open debate
-
బహిరంగ చర్చకు సిద్ధం.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుంది
న్యూఢిల్లీ: ఘన చరిత గల కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరనే అంశంలో ఇరు అభ్యర్థుల మధ్య ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చాసమరానికి తాను సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సారథి, దేశ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నేరుగా పలుమార్లు చర్చావేదికలపై బలాబలాలు ప్రదర్శించిన నేపథ్యంలో అదే మాదిరి పోటీని థరూర్ కోరుకోవడం విశేషం. ఆదివారం థరూర్ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ సమర్థవంతమైన నాయకుడిగా నన్ను నేను ఎప్పుడో రుజువు చేసుకున్నా. దాదాపు మూడు దశాబ్దాలు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన పలు పదవుల్లో బాధ్యతలు నెరవేర్చా. భారత్‌లో రాజకీయ ప్రస్థానానికొస్తే.. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదలుపెట్టిన ఐదేళ్లలోనే 20 రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ఇందులో క్రియాశీలక సభ్యులయ్యారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండున్నర వారాల వ్యవధి ఉంది. ఇంత తక్కువ టైమ్‌లో అందరు 9,000 మంది ప్రతినిధులను కలవడం కష్టం. అదే అభ్యర్థుల బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో ఇట్టే తెలుస్తుంది’ అని అన్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
నేను బహిరంగ చర్చకు సిద్ధం : జేసీ
-
ప్రత్తిపాటిది పలాయనవాదం
* మంత్రి ముందుగా ప్రకటించిన విధంగా * అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి * వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టౌన్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుది పలాయనవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నిజాయితీ నిరూపించుకొనేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి తీరా తాము అవినీతిని ఆధారాలతో నిరూపిస్తామని ప్రకటించాక, మంత్రి చర్చకు రారని అనుచరులతో ప్రకటన చేయించడం ఇందుకుS నిదర్శనమన్నారు. మంత్రి, ఆయన సతీమణి ఎక్కడెక్కడ, ఎవరి వద్ద నుంచి ఎంత వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నదీ నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక సిటీకేబుల్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన వారి వాటాలను లాక్కుని నెలనెలా లక్షల రూపాయలు ఆదాయం తీసుకుంటున్నది నిజం కాదా.. అని ప్రశ్నించారు. సిటీ కేబుల్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకొని తన అనుచరులతో ప్రచారం చేయించడం పేట ప్రజలందరికీ తెలుసన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షమైన వెఎస్సార్ సీపీకి సంబంధించి ఒక్క వార్తను ప్రసారం చేయకపోవడమే ఈ చానల్లో మంత్రి పాత్ర ఏమిటో స్పష్టమవుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో రైతుల పేరున మంత్రి కంపెనీలో పనిచేసే వారి పేరున చెక్కులు తీసుకొన్న వ్యవహారాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్యపేరున కొనుగోళ్లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యడవల్లి ఎస్సీ భూములలో మైనింగ్ తవ్వకాలు నిర్వహించేందుకు తన కంపెనీలో పనిచేసేవారితో దరఖాస్తు చేయించిన వ్యవహారాన్ని నిరూపిస్తామన్నారు. మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు -
తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...?
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలో నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నయని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జి.శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని రూ.కోట్ల నిధులు కేటాయించారో..? ఎంత మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయో ...? ప్రజలకు తెలియజెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఈ చర్చలో పార్టీ జిల్లా పెద్దలతో తాము వస్తామని, అధికారులను వెంటబెట్టుకుని అధికార పార్టీ నాయకులు రావాలని సూచించారు. ఆదివారం స్థానిక సత్యకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, నిధుల వ్యయం, నీటి సరఫరా వంటి వివరాలతో అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు. నిధుల కేటాయింపులు పరిశీలిద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, ఉన్న కొద్దిపాటి 10 శాతం పనులు పూర్తి చేయకుండానే ప్రారంభించిన టీడీపీ నాయకులు ఆ ఘనత తమదే అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలా అయితే 2004 నుంచి 2014 సంవత్సరంల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు, 2014 అనంతరం కేటాయించిన నిధుల లెక్కల వివరాలు పరిశీలిస్తే ఎవరి హయంలో పనులు జరిగాయో తేలిపోతుందన్నారు. పార్టీ నాయకుడు పిళ్లా విజయ్‌కుమార్ మాట్లాడుతూ విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అవినీతి, అక్రమార్జన, ప్రభుత్వ ఆస్తుల అడ్డుగోలు కేటాయింపులపై తూర్పారబట్టారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తెట్టంగి పీఏసీఎస్ అధ్యక్షుడు కె.రవిబాబు, పార్టీ వాణిజ్య విభా గం నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మథకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధం: జూనియర్ వైద్యులు
హైదరాబాద్: సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. తమపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. తాము న్యాయమైన డిమాండ్ల సాధనకే సమ్మె చేస్తున్నామని సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తమది తప్పు అని తేలితే తమ డిగ్రీలు ప్రభుత్వానికి ఇచ్చేసి సమ్మె మానుకుంటామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. -
చంద్రబాబు రక్తపిపాసి.. చర్చకు సై: కేసీఆర్
తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సవాలు విసిరారు. ఎన్కౌంటర్ల పేరుతో వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన రక్తపిపాసి చంద్రబాబేనని, అవినీతికి ఆయన మారుపేరని మండిపడ్డారు. దాని ఫలితంగానే అలిపిరి దాడి జరిగిందని అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బహిరంగ చర్చకు వస్తే తన చరిత్ర ఏంటో, చంద్రబాబు చరిత్ర ఏంటో తేలిపోతుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను కేంద్ర మంత్రిపదవిని కూడా గడ్డిపోచలా వదిలేస్తే బాబు మాత్రం పదవి కోసం మామకే వెన్నుపోటు పొడిచాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాగానే లోకేశ్, బ్రహ్మణి, భువనేశ్వరి.. ఇలా అందరి పేర్ల మీద ఉన్న బినామీ భూములన్నింటినీ కక్కిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు తనతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి చిదంబరమే స్వయంగా చెప్పారని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నది బాబేనని కేసీఆర్ విమర్శించారు. ''ఫాంహౌస్‌లో పడుకుంటా, నా ఇష్టం. నీకేం బాధ? కావాలంటే నువ్వు కూడా రా.. నీకేం అభ్యంతరం? కావాలంటే వారం రోజులుంటా, వ్యవసాయం చేసుకుంటా. నాకు వచ్చిన పనేంటో చూసుకుంటా. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి చెప్పి మరీ నేను ఆమరణ దీక్షకు దిగాను. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశాడో చెప్పగలడా? ఒక్కోసారి ఒక్కోమాట చెబుతావు. ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది నువ్వు కాదా? ఉప ఎన్నికల్లో 12కు 12 స్థానాల్లోనూ డిపాజిట్లు పోయినా ఇంకా బుద్ధి రాలేదా? ఇలాంటి దొంగలకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా?'' అని కేసీఆర్ అడిగారు.