తల్లికి బదులు కూతురు పరీక్ష
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో పట్టుబడిన వైనం
జడ్చర్ల టౌన్: ఓపెన్ టెన్త్ పరీక్షల్లో తల్లికి బదులు కూతురు, మరో ఇద్దరి స్థానంలో వేరే ఇద్దరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని అక్షర స్కూల్ కేంద్రంలో సోమవారం ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తల్లికి బదులుగా కూతురు పరీక్షకు హాజరు కావడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు.
అదేవిధంగా మరో ఇద్దరు విద్యార్థులకు బదులుగా మరో ఇద్దరు బయటి వారు పరీక్షలకు హాజరైనట్లు గుర్తించారు. అదే సమయంలో తనిఖీకి వచ్చిన రాష్ట్ర పరిశీలకులు రాజేశ్వర్రావు గమనించారు. ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించాలని ఎంఈఓ మంజులాదేవికి సూచిం చారు. ఎస్ఐ జములప్ప వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంతపూచికత్తుపై వదిలిపెట్టారు.