సభలోనే అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది
హైదరాబాద్: ప్లోర్లీడర్ల అభిప్రాయాలను శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ) సమావేశంలో కాకుండా శాసనసభలోనే తీసుకుంటే మంచిదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి, తెలంగాణ బిల్లుపై చర్చకు సంబంధించి నేతలు బీఏసీలో ఒక మాట, బయట మరోమాట మాట్లాడుతున్నారని చెప్పారు. అందువల్ల వారి అభిప్రాయాలు సభలో తెలుసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
బిఏసి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సమైక్య తీర్మానానికి పట్టుపడుతుంటే, కాంగ్రెస్, టిడిపి సభ్యులు మాత్రం రెండు అభిప్రాలు చెబుతున్న విషయం తెలిసిందే.