టీచర్లకు ఆప్షన్ అవకాశమివ్వాలి: పీఆర్టీయూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో 20 శాతమే భర్తీ చేస్తున్నారని, 2000 సంవత్సరం వరకు డీఎస్సీల ద్వారా ఓపెన్ కేటగిరీలో 30 శాతం భర్తీ చేసినందున స్థానికేతరులు ఎక్కు వ మంది తెలంగాణ జిల్లాలకు వచ్చారని, వారు తమ సొంత జిల్లాలకు వెళ్లేలా ఆప్షన్ ఇవ్వాలని కోరింది.
ఈ మేరకు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి గురువారం సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ ఇస్తే దాదాపు మూడువేల మంది తెలంగాణ నుంచి తమ సొంత జిల్లాలకు వెళతారని, ఆ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.