'తిరస్కార తీర్మానాన్ని అనుమతించొద్దు'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తిరస్కార తీర్మానాన్ని అనుమతించరాదని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ మంత్రులు లేఖ ఇచ్చారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ తమను సంప్రదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం ఇచ్చారని తెలిపారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని కోరారు. సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంగానే పరిగణించాలని సూచించారు.
కాగా శాసనసభ, శాసనమండలి ఈ ఉదయం ప్రారంభమైన వెంటనే అరగంట వాయిదా పడ్దాయి. విభజన బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర సభ్యులు, వద్దని తెలంగాణ సభ్యులు పోటీపోటా నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి.