opposition activists
-
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్ పవార్..?
న్యూఢిల్లీ: జూలై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ పోటీ చేస్తున్నారా? ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? తాజా పరిణామాలు చూస్తే ఔననే చెబుతున్నాయి. ప్రతిపక్షాలలో ఎవరినోట చూసిన శరద్ పవార్ పేరే వినిపిస్తోంది. అదీగాక రాష్ట్రపతి పదవికి శరద్ పవార్‌ను నామినేట్ చేసేలా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శరద్ పవర్‌తో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఈ విషయమై ఎన్సీపీ నేత శరద్ పవర్ ఇంకా స్పందించలేదు. పవార్‌తో ఆమ్ఆద్మీపార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఫోన్లో మాట్లాడారు . ఖర్గే ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తృణమాల్ అధినేత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఖర్గే ఫోన్లో సంభాషించారు. పైగా రాష్ట్రపతి ఎన్నిక గురించి ఈ నెల 15న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన శరద్ పవార్ అనేక పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీకి వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు బీజేపీ అన్ని పార్టీలతో చర్చలు జరిపి రాష్ట్రపతి ఎన్నికను ఏకాభిప్రాయం చేసే దిశగా జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను రంగంలోకి దింపింది. 2017లో కూడా బీజేపీ ఏకాభిప్రాయం కోసం వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ పేర్లను నామినేట్ చేసింది. ఐతే ఆ తర్వాత ఎన్డీయే తరుపున వెంకయ్య నాయుడుని బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీజేపీ ప్రతిపక్షాలతో ఏకాభ్రిప్రాయ చర్చలు ఫలించనట్లయితే రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధం కానున్నట్లు సమాచారం. (చదవండి: గవర్నర్ అధికారాల కోతలో దీదీ సక్సెస్.. బీజేపీ వ్యతిరేకత ఉన్నా 40 ఓట్లేనా?) -
విపక్ష కూటమి తథ్యం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ‘వ్యూహాత్మక బలమైన కూటమి’ ఏర్పాటు తథ్యమని స్పష్టమైంది. ఇందులో భాగంగానే తెరవెనుక సంప్రదింపుల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. యూపీ, బిహార్లలో ఈ సంప్రదింపులు తుదిదశలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే.. ప్రధాని అభ్యర్థిపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కూటమిలో విభేదాలు పొడసూపే అవకాశముందన్న పార్టీ సీనియర్ల హెచ్చరికలతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పలుచోట్ల ఇబ్బందులున్నా స్వల్పకాలిక లక్ష్యాల కోసం దోస్తీ తప్పడంలేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌తో దోస్తీ విషయంలో పీసీసీలను కలుపుకుని వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ మదిలో ఏముంది? ‘బీజేపీని ఓడించటమే కాంగ్రెస్ సహా విపక్షాల ముందున్న ఏకైక లక్ష్యం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం’ అని రాహుల్ సన్నిహిత నేత ఒకరు తెలిపారు. ‘మోదీ ప్రధాని కావాలంటే బీజేపీ సొంతగా 230–240 సీట్లు సంపాదించుకోవాలి. ఇంతకన్నా తక్కువ వస్తే.. ఎన్డీయే పక్షాల సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ స్థానంలో వేరొకరు ప్రధాని అవుతారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఈసారి విపక్ష కూటమి ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా మోదీ జోరును అడ్డుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వని రైతుల సమస్యలు, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పేదరికం, ఆర్థిక వ్యవస్థ, అవినీతి కేసులు, రాఫెల్ ఒప్పందం తదితరాంశాలే ప్రధాన అస్త్రాలుగా బీజేపీని అడ్డుకుంటామన్నారు. సిద్ధాంతాల మధ్యే పోటీ బీజేపీతోపాటు ఆరెస్సెస్ భావజాలంపై ఐకమత్యంగా పోరాడేందుకు పలు విపక్షాల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. యూపీ, బిహార్‌లతోపాటు మహారాష్ట్రలను కీలకమైన రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో మంచి దోస్తీ ఉంది. దీనికితోడు ఇటీవల శివసేన కూడా రాహుల్‌ను సమర్థిస్తూవస్తోంది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే శివసేన కు దూరంగా ఉండాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో ఇక్కడ ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోంది. పీసీసీలకూ అవకాశం అయితే పొత్తుల విషయంలో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకే పూర్తి అధికారాలు కట్టబెట్టినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమదే అధికారమని ఘంటాపథంగా చెబుతున్న కాంగ్రెస్.. సీఎం అభ్యర్థులను ప్రకటించకూడదని నిర్ణయించింది. ‘యూపీ, బిహార్, మహారాష్ట్రల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీని అడ్డుకోగలిగితే.. నరేంద్ర మోదీ పీఠాన్ని కదిలించినట్లే. 80 మంది ఎంపీలున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో వ్యూహాత్మక అంగీకారం చాలా అవసరం’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, హరియాణా సహా పలు ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతమైందన్నారు. -
మంత్రుల సమక్షంలోనే డిష్యుం డిష్యుం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎల్లిగుట్ట సమీపంలో మంచినీటి పైపులైన్ ప్రారంభోత్సవానికి దత్తాత్రేయ, కేటీఆర్ ఇద్దరూ వెళ్లారు. వాళ్లిద్దరూ వేదిక మీద ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. నిజానికి గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్గీయులకు, టీడీపీ-బీజేపీ వర్గీయులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉంది. గురువారం నాటి కార్యక్రమంలో అది బహిరంగంగా బయటపడింది. తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు మంత్రుల సమక్షంలోనే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి ప్రయత్నించగా, వీళ్లు కూడా గట్టిగా దాన్ని ప్రతిఘటించారు. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖమంత్రి పద్మారావు కలగజేసుకుని ఇరుపక్షాలకు చెందిన కార్యకర్తలను వారించారు. ఉప్పల్ ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఘర్షణ వాతావరణాన్ని చెదరగొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను గతంలో ఎప్పుడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే పనులు చేస్తున్నారని ప్రతిపక్ష కార్యకర్తలు ఆరోపించారు. -
మంత్రుల సమక్షంలోనే డిష్యుం డిష్యుం