అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడా?
సీఎం చంద్రబాబుపై మండలిలో విపక్షనేత రామచంద్రయ్య ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రూ.75 లక్షల కుంభకోణంపై పత్రికలో వచ్చిన వార్తకు అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా కోరిన బాబు.. ప్రస్తుతం రాజధానిలో వేల కోట్ల భూ కుంభ కోణాలపై పత్రికల్లో వస్తున్న వార్తలపైనా అలాగే స్పందించి వాటితో సంబంధమున్న మంత్రు లతో రాజీనామా కోరాలని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. గురు వారం శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ అవినీతిపై సభలో ప్రశ్నిస్తే ఆధా రాలివ్వండంటూ విపక్ష సభ్యులపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు.
ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తే వాటికి సంబంధించిన ఆధారాలు అధికారులు సేకరిస్తారన్నారు. కాగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రక్షిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, గోవిందరెడ్డి ఆరోపించారు. రాజమండ్రి బ్రిడ్జి లంక సొసైటీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.