ఆర్గానిక్ పండ్లేనా?
ప్రస్తుతం మనం తింటున్న పండ్లు, కూరగాయలు చాలావరకు రసాయనిక ఎరువులు వేసి పండించినవే. అయితే ఇటీవలి కాలంలో ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో... ఎక్కువ ధరతో పండ్లు, కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అవి 100 శాతం ఆర్గానిక్ ఫుడ్స్ అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, చూడగానే అవి ఆర్గానిక్ ఫుడ్స్ కావని గుర్తుపట్టలేం. అంతెందుకు రుచి చూసినా చెప్పలేం. మరేంటి దారి అనుకుంటున్నారా? ఇదిగో ఫొటోలో కనిపిస్తున్న ‘ఆర్గానిక్ సెన్సర్’. ఇది మీ పండ్లు, కూరగాయలు ఆర్గానిక్వో, కావో సులువుగా చెప్పేస్తుంది.
ఉదాహరణకు ఒక యాపిల్ పండుపై ఈ పరికరాన్ని పెడితే.. అందులో నైట్రేట్స్ (ఫర్టిలైజర్స్లో వాడేవి) ఉన్నాయో లేవో మీ ఫోన్లో చూపిస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదూ.. మరి ఇంకేం ఆర్గానిక్ పండ్లు, కూరగాయలనే తిని ఆరోగ్యంగా ఉండండి.