organisational polls
-
జనవరిలోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తికానుండగా, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు 15 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత జనవరి నెలాఖరు కల్లా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన పురోగతిపై అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నుంచి నివేదిక తీసుకున్నారు.అంతేగాక పార్టీ అంతర్గత ఎన్నికలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. నడ్డా దిశా నిర్దేశం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించడం, దేశంలోని వివిధ ప్రదేశాలలో అటల్జీ జీవితానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించడంపై నడ్డా దిశానిర్దేశం చేశారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, విజయాలు, ప్రధానంగా కార్గిల్ యుద్ధం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, పోఖ్రాన్ అణు పరీక్ష, స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి ప్రాజెక్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి విజయాలను ప్రదర్శించనున్నారు. ఇలావుండగా వివాదాస్పద అంశాలపై ప్రకటనలు, వ్యాఖ్యలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించింది. -
జనవరికల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు!
న్యూఢిల్లీ: పార్టీలో సంస్థాగత ఎన్నికలకు గడువును మరో 6 నెలలు పొడిగించాలన్న కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్(ఈసీ) అంగీకరించింది. డిసెంబర్ 31లోపు పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి తీరాలని చెప్పింది. ఈసీ నిర్ణయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ మాట్లాడుతూ ‘ఎన్నికల కమిషన్ మా విజ్ఞప్తిని మన్నించి సంస్థాగత ఎన్నికల గడువును జూన్ 30 నుంచి డిసెంబర్ 31 వరకూ పొడిగించింది’ అని తెలిపారు. తమకు చాలాతక్కువ సమయం మిగిలి ఉన్నందున సంస్థాగత ఎన్నికలకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ ఇంతకుముందు ఈసీని కోరింది. -
సంస్థాగత ఎన్నికలతో పార్టీకి పునరుత్తేజం: రాహుల్
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికలను పార్టీ పునరుత్తేజానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం మొదటిసారి సమావేశమైన రాహుల్.. సంస్థాగత ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. బోగస్ సభ్యులను తొలగించాలని, నకిలీ సభ్యత్వాలను ప్రోత్సహించవద్దని ఆదేశించారు. సంస్థాగత ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అధికారాలను ముల్లపల్లి రాంచంద్రన్ నేతృత్వంలోని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి ఇచ్చామని చెప్పారు. రాష్ట్రాల ఇన్చార్జ్లుగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు పీసీసీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ 2015 మొదట్లో ప్రారంభమై, జూలై 5 -25 తేదీల మధ్య నూతన అధ్యక్ష ఎన్నికతో ముగుస్తుంది. ఈ సంవత్సరం సంస్థాగత ఎన్నికలను 100% పారదర్శకంగా నిర్వహిస్తామని రామచంద్రన్ పేర్కొన్నారు.