Osey Arundhathi Teaser: ఆసక్తికరంగా ‘ఒసేయ్ అరుంధతి! ’ టీజర్
‘వెన్నెల’ కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. పద్మ నారాయణ ప్రొడక్షన్స్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఒసేయ్ అరుంధతి’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ నిర్మించాం. త్వరలో మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలనుకుంటుంది. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంది? అనేదే ‘ఒసేయ్ అరుంధతి’ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు.