నిరాశనే మిగిల్చిన ఆస్ట్రిచ్ గుడ్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రిచ్ పక్షుల గుడ్లు ఢిల్లీ జూ అధికారులకు నిరాశనమే మిగిల్చాయి. జూలోని ఓ ఆస్ట్రిచ్ పక్షి పెట్టిన 10 గుడ్లను జూ సిబ్బంది పొదిగేశారు. నిజానికి 45 నుంచి 55 రోజుల్లో ఆ గుడ్లలోనుంచి బుల్లి ఆస్ట్రిచ్లు బయటకు రావాలి. అయినప్పటికీ రాకపోవడంతో మరో పదిరోజులపాటు వేచి చూశారు. 62 రోజులు దాటినా ఆ గుడ్ల నుంచి ఎటువంటి పిల్లలు బయటకు రాకపోవడంతో గుడ్లు పొదగకుండానే పాడైపోయినట్లు గుర్తించిన అధికారులు నిరాశపడ్డారు. ఈ విషయమై జూ క్యూరేటర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. పొదిగే కాలం దాటి పోవడంతో అధికారులు గుడ ్లను పరీక్షించారు. అందులో ఎటువంటి జీవం లేదని గుర్తించారు. గుడ్లు పూర్తిగా పాడైపోయానని నిర్ధారణకు వచ్చారు. సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడం, ఇటీవల వర్షం కురవడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగానే గుడ్లు పొదగకుండా పాడైపోయానని అధికారులు తెలిపారు.
ఇటీవల వర్షాలు కురిసిన సమయంలోనే ఆస్ట్రిచ్ పక్షి గుడ్లు పెట్టింది. దీంతో వాటిని పొదుగేశాం. సరైన వేడి లేకపోవడంతోనే మొదటే అవి ఫలదీకరణం చెందకుండా పాడైపోయాయి. కొన్నిరోజులకు వాతావరణ పరిస్థితులు మారినా ఫలితం లేకుండా పోయింది. 20 సంవత్సరాల జూ చరిత్రంలో ఆస్ట్రిచ్ పక్షులు గుడ్లు పెట్టడడం ఇదే తొలిసారి. దీంతో వీటిని పొదుగేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అయినా ఎటువంటి ఫలితం లేకపోయింద’న్నారు. పది గుడ్లలో కనీసం ఐదు గుడ్లయినా బుజ్జి ఆస్ట్రిచ్ పిల్లలను ఇస్తాయని భావించామని, అయితే నిరాశే మిగిలందన్నారు. కాగా ఈసారి పెట్టే గుడ్లను మరింత జాగ్రత్తగా పొదుగేస్తామన్నారు.