ఏటీఎం వినియోగదారులకు వాత
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో ఏటీఎం వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాత పెట్టింది. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ (హోమ్ బ్యాంక్) ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం (థర్డ్‌పార్టీ) ద్వారా నగదు ఉపసంహరణ ఉచిత అవకాశాలను మూడుకు పరిమితం చేసింది. ఇంతకుముందు నెలలో ఐదు ఉచిత అవకాశాలు ఉండేవి.
ఇక నుంచి మూడు సార్లుకు మించి ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు డ్రా చేస్తే రూ. 20 చెల్లించాల్సివుంటుంది. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు తాజా నిబంధన వర్తించదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం వివరాలను తెలియజేయాలని సైతం బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.