డాలర్ డామినేషన్: ఆయిల్ ధరలు పతనం
న్యూయార్క్ : ఓ వైపు మధ్య ప్రాచ్య దేశాల్లో పెరిగిన క్రూడ్ ఉత్పత్తి.. మరోవైపు బలమైన డాలర్ విలువతో మంగళవారం అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్లో ఆయిల్‌కు, ఇతర కరెన్సీలకు సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ డాలర్ విలువ ఆధిపత్య స్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ అక్టోబర్ డెలివరీ న్యూయార్క్ మేర్కన్టైల్ ఎక్స్ఛేంజ్లో బ్యారల్ 0.67 డాలర్లు నష్టపోయి 46.97 డాలర్ల వద్ద స్థిరపడింది.
అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ అక్టోబర్ డెలివరీ లండన్ ఐసీఈ ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్లో బ్యారల్ 0.66 డాలర్లు పడిపోయి 49.26 బాలర్లగా నమోదైందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టుచేసింది. ఇరాక్ తన దక్షిణ పోర్ట్స్ నుంచి ఆగస్టులో క్రూడ్‌ను ఎక్కువగా ఎగుమతి చేసిందని, ఈ ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఆయిల్ మంత్రి శనివారం మీడియాకు వెల్లడించారు.
దీంతో డాలర్ ఇండెక్స్‌లో ఆయిల్ ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వడ్డీరేట్లు పెంచే అవకాశాలు పెరిగాయంటూ ఫెడరల్ రిజర్వు చైర్ పర్సన్ జానెట్ యెలెన్ చేసిన చేసిన వ్యాఖ్యాల నేపథ్యంలో డాలర్ భారీగా పుంజుకుంది. మరోవైపు నుంచి ఫెడరల్ రిజర్వు ఈ ఏడాది చివర్లో వడ్డీరేట్లు పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ మూడు వారాల గరిష్ట స్థాయిలో నమోదైంది..