Our Sacred Space
-
అవసరాల అవధి..
జీవితంలో మంచీచెడు రెండూ ఒకదానివెంట ఒకటి ఉంటాయి. ఒకదానిపై మరొకటి పెత్తనం చెలాయిస్తాయి. నైతికత, ఔచిత్యం.. ఇవన్నీ మనిషిని ఉన్నతమైన ఆలోచనల దిశగా ప్రభావితం చేస్తే, అవసరాలు మనసును కలుషితం చేస్తుంటాయి. ఇవే అంశాలను ఒక ఆటోడ్రైవర్ జీవితానికి జతకలిపి రూపొందించిన చిట్టి చిత్రం ‘ద క్యాటలిస్ట్’. బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌కు తన ఆటోలో పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్‌ను ఆ ప్యాసింజర్‌కు తిరిగి ఇచ్చేయమని మనసు చెబుతుంది. అదే సమయంలో అతడి ఆర్థిక అవసరాలు.. ఆ డబ్బును వినియోగించుకోవాలని ప్రోద్బలం చేస్తాయి. ఈ సంఘర్షణలో ఆ ఆటోడ్రైవర్ ఏం చేశాడన్నది తర్వాతి కథాంశం. వైష్ణవి సుందర్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించనున్నారు. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీరోడ్, సికింద్రాబాద్ -
సపోర్ట్ టు పారా అథ్లెట్స్
విధి చేతిలో ఓడిన అతను.. ఇప్పుడు విధిని ఎదిరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా.. సైక్లింగ్‌లో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు.. తోటి పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన అశోక్ మెహతా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పేరుతో పారా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను సినీ నటి అక్కినేని అమల చేతుల మీదుగా అందజేశారు. విజయవాడకు చెందిన పారా స్వివ్ముర్ శ్రీనివాస్ నాయుుడు, కోల్‌కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ వుండల్,నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్‌లకు కృత్రివు అవయువాలు, సైకిళ్లను పంపిణీ చేశారు. ‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అశోక్ మెహతా సైక్లింగ్‌లో రాణించడమే కాకుండా తోటి పారా అథ్లెట్లకు సహాయం చేయడం గర్వించదగ్గ విషయం’ అని అమల అన్నారు. -
సుందరకాండ
అవర్ సేక్రెడ్ స్పేస్ నిర్వాహకురాలు, ఒడిస్సీ కళాకారిణి నయనతార వినూత్న నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వయంగా డిజైన్ చేసుకున్న నృత్యంతో ఆమె హనుమాన్ చాలీసాను ప్రదర్శించి ఆహుతులను అలరించారు. ప్రముఖ యోగా గురువు గజాననం ఆధ్వర్యంలో యోగా శిక్షణ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ జరిగింది. నాన్ వయోలెన్స్ కమ్యూనికేషన్లో షమ్మీ,నంద వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ఓ మధు