అవసరాల అవధి.. | auto driver short film is The catalytic | Sakshi
Sakshi News home page

అవసరాల అవధి..

Published Fri, Apr 24 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

అవసరాల అవధి..

అవసరాల అవధి..

జీవితంలో మంచీచెడు రెండూ ఒకదానివెంట ఒకటి ఉంటాయి. ఒకదానిపై మరొకటి పెత్తనం చెలాయిస్తాయి. నైతికత, ఔచిత్యం.. ఇవన్నీ మనిషిని ఉన్నతమైన ఆలోచనల దిశగా ప్రభావితం చేస్తే, అవసరాలు మనసును కలుషితం చేస్తుంటాయి. ఇవే అంశాలను ఒక ఆటోడ్రైవర్ జీవితానికి జతకలిపి రూపొందించిన చిట్టి చిత్రం ‘ద క్యాటలిస్ట్’. బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌కు తన ఆటోలో పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్‌ను ఆ ప్యాసింజర్‌కు తిరిగి ఇచ్చేయమని మనసు చెబుతుంది.

అదే సమయంలో అతడి ఆర్థిక అవసరాలు.. ఆ డబ్బును వినియోగించుకోవాలని ప్రోద్బలం చేస్తాయి. ఈ సంఘర్షణలో ఆ ఆటోడ్రైవర్ ఏం చేశాడన్నది తర్వాతి కథాంశం. వైష్ణవి సుందర్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించనున్నారు.
వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీరోడ్, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement