టాప్లో టయోటా
న్యూఢిల్లీ: జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. టయోటా కిర్లోస్కర్ అనేక దిగ్గజ కార్ల కంపెనీల వెనక్కి నెట్టి వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం అమ్మకాల్లో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లను ఘోరంగా ఓడించింది. తక్కువ వాల్యూమ్ కలిగి ఉన్నప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద కార్ మేకర్ హ్యుందాయ్ ను వెనక్కి నెట్టేసింది. మారుతి సుజుకి తరువాత టయాటా హయ్యస్ట్ సెగ్మెంట్ లీడర్ గా అవతరించింది. అయితే హ్యుందాయ్ ఒక సెగ్మెంట్ లో లీడ్ లో ఉండగా టాటా మోటార్స్ కు అది కూడా దక్కలేదు. టయోటా కంపెనీకి ఉన్న మొత్తం 7 ప్రధాన ఉత్పత్తులో మూడు రారాజుల్లా నిలిచాయి. ఎగ్జిక్యూటివ్ సెడాన్ యూవీ2 ( రూ .15 లక్షలు లోపు) యూవీ 4 ( రూ .25 లక్షలులోపు), ప్యాసింజర్ వాహనాల కేటగిరిలో కరోల్లా, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ టాప్ లో నిలిచాయి. అలాగే భారతదేశం లో ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ క్రూజర్ ప్రదోలను కూడా విక్రయిస్తోంది. అయితే, ప్రీమియం విభాగాలపైనే దృష్టి సారించి కంపెనీ మాస్ కారు సెగ్మెంట్లో మాత్రం ప్రవేశించలేకపోయింది.
ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్లో నెలకు 1,200 యూనిట్లు, యూవీ2,యూవీ 4 మార్కెట్ పరిమాణం వరుసగా 20,000, 15,00 యూనిట్లు విక్రయిస్తున్నట్టుకంపెనీ పేర్కొంది. 2010 నుంచి ఎతియోస్ సిరీస్లో తమఉత్పత్తుల ద్వారా బి హాచ్, బి సెడాన్ విభాగాలలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ ఎన్ రాజా చెప్పారు. రూ .10 లక్షల ధర బ్యాండ్ , ఆ పై విభాగాలలో ప్రధానంగా ఉన్నామనీ, ఇతియోస్ సిరీస్ లో ఇతియోస్ లివా, క్రాస్ వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించిందనీ, తమ సేవలు ఇకముందు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. 2000 సీసీ డీజిల్ వాహనాలపై నిషేధం ఉన్నప్పటికీ 2017 ఆర్థిక సంవ్సతరంలో మరింత అధిగమిస్తామని కంపెనీ ప్రకటించింది. కాగా టయోటా భారతదేశం లో అమ్మకాల పరంగా టాప్ 10 కార్ల తయారీ కంపెనీల్లో 5 వ స్థానంలో టయాటో నిలుస్తుంది.