Outsourcing policy
-
‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్’లో నియామకాలు సరికాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు బోధన సిబ్బంది పోస్టులను శాశ్వత పద్ధతిలో కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా ఏళ్ల తరబడి చేస్తున్న నియామకాల వల్ల ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలు కావడం లేదని ఆక్షేపించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనవారిని తొలగించి ఏటా మళ్లీ కొత్త వారి కోసం వర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయని.. ఇది ఏమాత్రం సహేతుకం కాదని తెలిపింది. మంజూరు చేసిన పోస్టుల్లో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడం వల్ల ఆయా వర్సిటీల నుంచి ప్రతిభావంతులైన గ్రామీణ యువతను తయారు చేయాలన్న ఉద్దేశం నెరవేరకుండా పోతుందని విచారం వ్యక్తం చేసింది. అంతిమంగా విద్యార్థుల జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నాయంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్, తాత్కాలిక బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ రిజిస్ట్రార్ ఈ ఏడాది జనవరి 8న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేసింది. పిటిషనర్లను తొలగించవద్దని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, వర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కుంచెం గణేశ్‌రెడ్డి, మరో 10 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రజా సమస్యలపై స్పందించండి
► అధికారులకు కలెక్టర్ జగన్మోహన్ ఆదేశం ► ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ► కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలని జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి తీసుకున్న చర్యల వివరాలను తనకు అందజేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో సంజీవరెడ్డి గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలసత్వం వహించకూడదని, ఏ రోజుకారోజు సమస్యలు వస్తుంటాయని, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఫోనిన్ను సద్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో జలపతి నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవో ప్రకారం వేతనాలివ్వాలి ఆదిలాబాద్ రిమ్స్‌లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పని చేస్తున్న 48 మంది సెక్యూరిటీ గార్డులకు జనవరి నుంచి అమలైన జీవో 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలి. రిమ్స్ డెరైక్టర్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. జీవో ప్రకారం వేతనాలిస్తూ సెక్యూరిటీలకు న్యాయం చేయాలి. - వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు, ఆదిలాబాద్ -
ఎక్కడి చెత్త అక్కడే
జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. డిమాండ్ల సాధనకోసం పారిశుద్ధ్య కార్మికులు నాలుగురోజులుగా సమ్మెబాట పట్టారు. దీంతో వ్యర్థాలను తొలగించేవారు లేక అన్ని పట్టణాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సమ్మెకు దిగుతామని కార్మికులు ముందుగానే ప్రకటించినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. - ‘పురం’.. దుర్గంధభరితం - మునిసిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం - సిబ్బంది సమ్మెతో లోపించిన పారిశుద్ధ్యం - ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయని అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని 11 మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో 964 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె చేపడుతుండగా, వీరికి మద్దతుగా 256మంది సిబ్బంది సమ్మెకు దిగడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగామారింది. దీంతో మునిసిపాలిటీల్లో రోడ్లపై తిరగలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన అధికారులు వాటి ఊసేఎత్తడం లేదు. కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎన్నోసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వెట్టిచాకిరీ చేయలేక సమ్మెకు దిగామని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్ అలీ అన్నారు. నాలుగు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. -
కొలువులుఇస్తారా!
ప్రగతినగర్ : ప్రభుత్వ శాఖలలో త్వరలో ఔట్సోర్సింగ్ విధానంలో వెయ్యి పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉద్యోగ ఏజెన్సీలు వేసిన టెండర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హతలేని ఏజెన్సీలు సైతం టెండర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ వేయగా 27 ఏజెన్సీ లు టెండర్లు దాఖలు చేశాయి. సీల్డు టెండర్లను గతనెల 20న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి ఏజెన్సీ నిర్వాహకుల సమక్షంలో తెరిచారు. కాగా కొన్ని ఏజెన్సీలు బినామీ పత్రాలు దాఖలు చేసి టెండర్ లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఏజెన్సీలు, క్రిమినల్ కేసులు నమోదైనవారు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు జమచేయని, సరైన ధ్రువపత్రాలు లేని ఏజెన్సీలు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఒకేసారి వెయ్యి పోస్టుల నియామకాలు జరుపుతుండడంతో ఏజెన్సీల మధ్య పోటీ తీవ్రమైంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఏజెన్సీలు టెండర్ దాఖలు చేశాయి. మొత్తం 33 మంది ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తులు తీసుకువెళ్లగా 27 మంది ఈఎండీ చెల్లించి టెండర్లో పాల్గొన్నారు. వీరిలో ప్రస్తుతం జిల్లాలోని కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ నడుపుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో పాటు కొత్తవారు ఉన్నారు. ఈనెల 20న అదనపు జేసీ శేషాద్రి తన చాంబర్లో టెండర్‌దారుల సమక్షంలో బాక్స్ ఓపెన్ చేసి ఏజెన్సీలు నమోదు చేసిన ‘కోట్’ను చదివి విని పించారు. వాస్తవానికి ఏజెన్సీల ఎంపికలో తక్కువ కోట్తో సంబంధం లేకుండా ఏజెన్సీలకు ఉన్న అర్హతలు, అనుభవం, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు, పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి టీడీఎస్ (టాక్స్ డిడ క్షన్ సోర్స్) 2.64 శాతం చెల్లించిన అర్హత కూడా ఉండాలి. ఈ ప్రకారం టెండర్ వేసిన 27 ఏజెన్సీల అర్హతలు అదే రోజు రాత్రి పదిగంట వరకు అధికారులు పరిశీలించారు. బినామీ పత్రాలు సమర్పించి వీటిలో కొన్ని ఏజెన్సీలు బినామీ అర్హత పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముందు తక్కువ కోట్ చేసిన ఏజెన్సీల ఒరిజినల్ అర్హత పత్రాలు పరిశీలించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, ఉపాధి కల్పానాధికారి మోహన్‌లాల్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీల ఎంపికలో ఎక్కడ కూడ నిబంధనలు ఉల్లంఘించకుండా అర్హత కలిగిన పది ఏజెన్సీలను ముందు గుర్తించి ఫైల్ తనదగ్గరకు పంపాలని సూచించారు. అధికారులు పరిశీలించిన ఏజెన్సీ జాబి తాను ఈనెల 13 కలెక్టర్ పరిశీలించనున్నట్లు అధికారికి వర్గాలు చెబుతున్నా యి. స్క్రూటినీ చేసి ఏఏ ఏజెన్సీలకు అర్హత ఉందో కలెక్టర్ అదేరోజు ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం పది ఏజెన్సీలకు ఒక్కో ఏజెన్సీకి వంద చొప్పున పోస్టుల భర్తీ కోసం ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు తప్ప మిగితావన్నీ ఇతర ఏజెన్సీల అర్హత పత్రాలే సమర్పించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2012 ఆగస్టులో జరిపిన అవుట్ సోర్సింగ్ నియామకాలలో ఓ ఏజెన్సీకి 70 పోస్టుల భర్తీ అప్పగించారు. అయితే, ఆ ఏజెన్సీ 30 మందికి మాత్రమే ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లిం చినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.