outstanding talent
-
JP Morgan: మోదీ పనితీరు అద్భుతం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్స్ సంస్థ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సంస్కరణలను డిమోన్ కొనియాడారు.‘‘సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్‌లో ప్రధాని మోదీ 40 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. అక్కడ పలు రాష్ట్రాల్లోని పన్ను వ్యవస్థల సంక్లిష్టతలను ఛేదించి సంస్కరించారు. సానుకూల మార్పు దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’’ అంటూ మోదీని పొగిడారు. -
‘చిలక’ పలుకు
♦ గిరిజన విద్యార్థి రాహుల్ అద్భుత ప్రతిభ ♦ 7.40 నిమిషాల్లో వేమన శతక పద్యధారణ ♦ రికార్డును తిరగరాసిన సిద్ధారం విద్యార్థి ♦ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూట్నీలో ఎంపిక సత్తుపల్లి: సిద్ధారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిలక రాహుల్ అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం సోమవారం పాఠశాలలో జరిగిన స్క్రూట్నీలో వేమన శతకంలోని 100 పద్యాలను 7.40 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డులు తిరగరాశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా రికార్డు గతంలో సింగరాజు మంజునాథ్ పేరున ఉండేది. 11 ఏళ్ల వయసులో మంజునాథ్ 2015 అక్టోబర్‌లో తిరుపతిలో జరిగిన వేమన పద్యాల పోటీల్లో 11.40 నిమిషాల్లో రికార్డు నమోదు చేశాడు. దాన్ని సోమవారం 12 ఏళ్ల రాహుల్ తిరగరాయటం గమనార్హం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథులు తహసీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఎంపీడీఓ రవి చేతులమీదుగా రాహుల్ స్క్రూట్నీ గుర్తింపు పత్రాన్ని పొందాడు. త్వరలో ప్రధాన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ♦ రాహుల్ నేపథ్యం: ఎస్టీ నాయకపోడు వర్గానికి చెందిన చిలక రాంబాబు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్ (8వ తరగతి), సుస్మిత (6వ తరగతి). వీరు సిద్ధారం యూపీఎస్ పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ అద్భుత ప్రదర్శనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ♦ ఇదో అద్భుత ఘట్టమని తహసీల్దార్ పుల్లయ్య పేర్కొన్నారు. రా హుల్‌ను ప్రోత్సహించిన ఉపాధ్యా య బృందాన్ని అభినందించారు. ♦ 8 నిమిషాల్లోపే వేమన శతక పద్యాలను పూర్తి చేయడం అద్భుత ఘట్టమని ఎంపీడీఓ రవి పేర్కొన్నారు. ♦ తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి రాహుల్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ప్రధాన పోటీలకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, హెచ్ఎం బి.మధుసూదన్‌రాజు, సృజన బాధ్యులు రామకృష్ణ తదితరులు రాహుల్‌కు, బొమ్మారెడ్డికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. శేషగిరి, మాలతి దంపతులు వీరిని శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, నాగాచారి, మస్తాన్, రజనీదేవిలతో పాటు ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంఈఓ బి.రాములు, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎన్.రాజేశ్వరరావు, గురుజ్యోతి నిర్వాహకులు చిత్తలూరి ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గాచారి, ఉపసర్పంచ్ శ్రీరాములు రాహుల్‌ను అభినందించిన వారిలో ఉన్నారు. -
అద్భుతం
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆర్ట ఫెస్టివల్ ఆకట్టుకుంది. మొత్తం ఆరు విభాగాల్లో చిన్నారులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. విదేశీయులు సైతం చిన్నారుల సృజనకు నీరాజనం పట్టారు. అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలోని పది మండలాల నుంచి 204 మంది విద్యార్థులు ఆర్ట ఫెస్టివల్లో తమ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో 34 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో ముగ్గురు డిజబుల్డ్ చిన్నారులు కావడం విశేషం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, ఎయిడ్స్‌కి దూరంగా ఉండాలని, స్వచ్ఛ భారత్, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళ, దేవతామూర్తుల మట్టి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. నవధాన్యాలు, ఆకులు, వివిధ రకాల పూల మొక్కలతో చిన్నారులు చేసిన పార్క్, ఆసిడ్ దాడులు వద్దంటూ, డాబా, పూరిళ్లు, పేపర్లతో తయారు చేసిన అనేక రకాల బొమ్మలను ప్రదర్శించారు. - అనంతపురం రూరల్ సత్తా చాటిన విభిన్న ప్రతిభావంతులు ఆర్డీటీ మెయిన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట ఫెస్టివల్లో విభిన్న ప్రతిభావంతులు మరోసారి సత్తా చాటుకున్నారు. మట్టి శిల్పాలు, పార్కలు, చిత్రలేఖనం తదితర రంగాలలో వారు అద్భుత ప్రతిభను కనపరిచి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల ప్రదర్శనను ఆర్డీటీ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖర్ నాయుడు ప్రత్యేకంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఫెస్టివల్ రూపకర్త మైఖేల్‌పెర్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై్ మాట్లాడుతూ... ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. చదువుతో పాటు సృజనాత్మకత అవసరం.’ అని అన్నారు. విజేతలు వీరే... ఆర్ట ఫెస్టివల్ విజేతలను ఆ సంస్థ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖరనాయుడు ప్రకటించారు. రంగోలిలో అశ్విణి(జల్లిపల్లి), హేమలత(కురువల్లి), సహన(మరూరు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మట్టి బొమ్మల తయారీలో మీనాక్షి(దేవరపల్లి), రాఘవ(కురువల్లి), ఆదిత్య(ఉప్పొండ), చిత్రలేఖనంలో రిషిక్(లత్తవరము), సుదర్శన్(కురువల్లి), సుహేల్(కదిరి), పేపర్ కటింగ్‌లో శంకరమ్మ(చంద్రగిరి, కనేకల్), మహేష్(సీబీఆర్ సెంటర్), స్వాతి(సీబీఆర్ సెంటర్), నాచురల్ కాలేజీలో శివయ్య(సీబీఆర్ సెంటర్), కవిత(సీబీఆర్ సెంటర్), చంద్రకళ(వెలిగొండ), చేతిరాతలో రాజ్‌కుమార్(పీఎండీ కాలనీ, పామిడి), వెంకటేష్(సీబీఆర్ సెంటర్), కావేరి(రాయలచెరువు, తాడిపత్రి) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.