అద్భుతం | Awesome | Sakshi
Sakshi News home page

అద్భుతం

Published Sat, Nov 15 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

అద్భుతం

అద్భుతం

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆర్‌‌ట ఫెస్టివల్ ఆకట్టుకుంది. మొత్తం ఆరు విభాగాల్లో చిన్నారులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. విదేశీయులు సైతం చిన్నారుల సృజనకు నీరాజనం పట్టారు. అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలోని పది మండలాల నుంచి 204 మంది విద్యార్థులు ఆర్‌‌ట ఫెస్టివల్‌లో తమ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో 34 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో ముగ్గురు డిజబుల్డ్ చిన్నారులు కావడం విశేషం.

సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, ఎయిడ్స్‌కి దూరంగా ఉండాలని, స్వచ్ఛ భారత్, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళ, దేవతామూర్తుల మట్టి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. నవధాన్యాలు, ఆకులు, వివిధ రకాల పూల మొక్కలతో చిన్నారులు చేసిన పార్క్, ఆసిడ్ దాడులు వద్దంటూ, డాబా, పూరిళ్లు, పేపర్లతో తయారు చేసిన అనేక రకాల బొమ్మలను ప్రదర్శించారు.                - అనంతపురం రూరల్
 
 సత్తా చాటిన విభిన్న ప్రతిభావంతులు
 
 ఆర్డీటీ మెయిన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌‌ట ఫెస్టివల్‌లో విభిన్న ప్రతిభావంతులు మరోసారి సత్తా చాటుకున్నారు. మట్టి శిల్పాలు, పార్‌‌కలు, చిత్రలేఖనం తదితర రంగాలలో వారు అద్భుత ప్రతిభను కనపరిచి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల ప్రదర్శనను ఆర్డీటీ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖర్ నాయుడు ప్రత్యేకంగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఫెస్టివల్ రూపకర్త మైఖేల్‌పెర్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై్ మాట్లాడుతూ...    ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసేందుకే  ప్రతి ఏటా ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. చదువుతో పాటు సృజనాత్మకత అవసరం.’ అని అన్నారు.
 
 విజేతలు వీరే...
 ఆర్‌‌ట ఫెస్టివల్ విజేతలను ఆ సంస్థ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖరనాయుడు ప్రకటించారు. రంగోలిలో  అశ్విణి(జల్లిపల్లి), హేమలత(కురువల్లి), సహన(మరూరు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మట్టి బొమ్మల తయారీలో  మీనాక్షి(దేవరపల్లి), రాఘవ(కురువల్లి), ఆదిత్య(ఉప్పొండ), చిత్రలేఖనంలో రిషిక్(లత్తవరము),  సుదర్శన్(కురువల్లి), సుహేల్(కదిరి), పేపర్ కటింగ్‌లో శంకరమ్మ(చంద్రగిరి, కనేకల్), మహేష్(సీబీఆర్ సెంటర్), స్వాతి(సీబీఆర్ సెంటర్), నాచురల్ కాలేజీలో శివయ్య(సీబీఆర్ సెంటర్), కవిత(సీబీఆర్ సెంటర్), చంద్రకళ(వెలిగొండ), చేతిరాతలో రాజ్‌కుమార్(పీఎండీ కాలనీ, పామిడి), వెంకటేష్(సీబీఆర్ సెంటర్),  కావేరి(రాయలచెరువు, తాడిపత్రి) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement