‘చిలక’ పలుకు | out standing talent in tribal student poem returnation | Sakshi
Sakshi News home page

‘చిలక’ పలుకు

Published Tue, Mar 29 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

‘చిలక’ పలుకు

‘చిలక’ పలుకు

గిరిజన విద్యార్థి రాహుల్ అద్భుత ప్రతిభ
7.40 నిమిషాల్లో వేమన శతక పద్యధారణ
రికార్డును తిరగరాసిన సిద్ధారం విద్యార్థి
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూట్నీలో ఎంపిక

 సత్తుపల్లి:  సిద్ధారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిలక రాహుల్ అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం సోమవారం పాఠశాలలో జరిగిన స్క్రూట్నీలో వేమన శతకంలోని 100 పద్యాలను 7.40 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డులు తిరగరాశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా రికార్డు గతంలో సింగరాజు మంజునాథ్ పేరున ఉండేది. 11 ఏళ్ల వయసులో మంజునాథ్ 2015 అక్టోబర్‌లో తిరుపతిలో జరిగిన వేమన పద్యాల పోటీల్లో 11.40 నిమిషాల్లో రికార్డు నమోదు చేశాడు. దాన్ని సోమవారం 12 ఏళ్ల రాహుల్ తిరగరాయటం గమనార్హం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథులు తహసీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఎంపీడీఓ రవి చేతులమీదుగా రాహుల్ స్క్రూట్నీ గుర్తింపు పత్రాన్ని పొందాడు. త్వరలో ప్రధాన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

రాహుల్ నేపథ్యం: ఎస్టీ నాయకపోడు వర్గానికి చెందిన చిలక రాంబాబు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్ (8వ తరగతి), సుస్మిత (6వ తరగతి). వీరు సిద్ధారం యూపీఎస్ పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ అద్భుత ప్రదర్శనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదో అద్భుత ఘట్టమని తహసీల్దార్ పుల్లయ్య పేర్కొన్నారు. రా హుల్‌ను ప్రోత్సహించిన ఉపాధ్యా య బృందాన్ని అభినందించారు.

8 నిమిషాల్లోపే వేమన శతక పద్యాలను పూర్తి చేయడం అద్భుత ఘట్టమని ఎంపీడీఓ రవి పేర్కొన్నారు.

తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి రాహుల్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ప్రధాన పోటీలకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, హెచ్‌ఎం బి.మధుసూదన్‌రాజు, సృజన బాధ్యులు రామకృష్ణ తదితరులు రాహుల్‌కు, బొమ్మారెడ్డికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. శేషగిరి, మాలతి దంపతులు వీరిని శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, నాగాచారి, మస్తాన్, రజనీదేవిలతో పాటు ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంఈఓ బి.రాములు, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎన్.రాజేశ్వరరావు, గురుజ్యోతి నిర్వాహకులు చిత్తలూరి ప్రసాద్, ఎస్‌ఎంసీ చైర్మన్ దుర్గాచారి, ఉపసర్పంచ్ శ్రీరాములు రాహుల్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement