
మృత్యువాత పడిన విద్యార్థిని తులసి
విశాఖపట్నం, అనంతగిరి: పరీక్షలలో ఫెయిలు అయ్యానన్న మనస్తాపంతో ఓ గిరిజన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం..మండలంలోని గుమ్మకోట పంచాయతీకి భీమవారం గ్రామానికి చెందిన బిడ్డ తులసి(17) శృంగవరపుకోట ఓ ప్రయివేటు కళాశాలలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం విడుదలైన పరీక్షల ఫలితా లలో తన పరీక్ష తప్పిందని తెలుసుకుని క్లోరోకిన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. దీంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు శృంగవరపుకోటకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ ఆమె మృత్యువాత పడింది. తులసి మృతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment