Oximeter
-
చనిపోయినా బతికే ఉన్నాడంటూ... ఇంట్లోనే 18 నెలలుగా ఉంచి..
కాన్పూర్: ఒక కుటుంబం కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని చెబుతూ 18 నెలలుగా ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడు ఆదాయపు పన్ను అధికారి విమలేష్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఐతే అతనికి పెట్టి ఉన్న ఆక్సిమీటర్ తప్పుడూ రీడింగ్ చూపించడంతో అతను బతికే ఉన్నాడని కుటుంబం నమ్ముతోంది. విమలేష్ తల్లి ఆ ఆక్సిమీటర్‌ని చూసి తన కొడుకు బతికే ఉన్నాడని బలంగా నమ్మడంతో కుటుంబ సభ్యులంతా అతడు బతికే ఉన్నాడనుకన్నారు. అందుకే ఆ అధికారి విమలేష్ మృతదేహాన్ని దహనం చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబసభ్యులను విచారించారు. విచారణలో...తల్లిని నమ్మి విమలేష్ మృతదేహాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐతే మృతుడి భార్య మితాలీ దీక్షిత్ మాత్రం చనిపోయినట్లు తనకు తెలుసునని కానీ కుటుంబ సభ్యులంతా బతికే ఉన్నాడని చెప్పడంతో నమ్మానని చెప్పింది. ఆమె తన భర్త కార్యాలయంలో కూడా అతను చనిపోయినట్లు తెలియజేశానని, కానీ కుటుంబసభ్యలు అనారోగ్యంతో ఉన్నట్లు ఒక లేఖను పంపించారని తెలిపింది. అంతేగాదు వారు 18 నెలలుగా చనిపోయిన వ్యక్తి జీతాన్ని కూడా పొందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శరీరానికి ఉన్న ఆక్సిమీటర్ తప్పడు రీడింగ్ చూపిస్తోందని తెలిపారు. ఇక పోలీసులే జోక్యం చేసుకుని కుటుంబంతో బలవంతంగా సదరు మృతుడికి దహన సంస్కారాలు జరిపించారు. అంతేగాదు పోలీసులు కుటుంబం సంప్రదించిన వైద్యులు వివరాలను కూడా సేకరించడమే గాక కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మృతుడు విమలేష్ సోదరుడు దినేష్ మాత్రం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా బలవంతంగా దహన సంస్కారాలు చేసేశారు, ఇప్పుడేమో విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ వాపోతున్నాడు. అతేగాదు సీఎం పోర్టల్‌లో పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. (చదవండి: పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు) -
‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
పీఎం కేర్ నిధులతో 1.5 లక్షల ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సమస్యను తీర్చేందుకు డీఆర్డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను సరిచేసుకోగల టెక్నాలజీ ఉన్న ఆక్సిజన్ వ్యవస్థలను సేకరించనుంది. దాదాపు 1.5 లక్షల ఈ వ్యవస్థలను అందుబాటులోకి తేనుంది. పీఎం కేర్స్ నిధుల నుంచి రూ.322.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించినట్లు డీఆర్డీవో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవస్థను కొద్ది నెలల కిందట డీఆర్డీవోలోని డెబెల్ సంస్థ ఆక్సికేర్ పేరుతో స్వయంగా అభివృద్ధి చేసింది. ఎత్తయిన ప్రాంతాల్లో పనిచేసే సైనికుల కోసం అభివృద్ధి చేసిన ఈ ఆక్సికేర్ వ్యవస్థలను కరోనా చికిత్సకు సమర్థంగా ఉపయోగించొచ్చని తెలిపింది. ఈ 1.5 లక్షల ఆక్సికేర్ యూనిట్లలో లక్ష యూనిట్లు సాధారణమైనవి కాగా.. మిగిలినవి ఆటోమేటిగ్గా పనిచేసేవి. సాధారణ ఆక్సికేర్ యూనిట్లో 10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్, పీడన, ప్రవాహాలను నియంత్రించే కంట్రోలర్, తేమను చేర్చే హ్యుమిడిఫయర్, ముక్కుకు అనుసంధానించుకునే నాసల్ క్యానులా ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్ మోతాదుకు అనుగుణంగా కంట్రోలర్ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ఆక్సీమీటర్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఏర్పాటు చేశా రు. ఇందులో రక్తంలోని ఆక్సిజన్ మోతాదు గుర్తిం చి లెక్కకట్టేందుకు ఓప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ గుర్తిం చిన ఆక్సిజన్ మోతాదులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఆక్సిజన్ విడుదలను నియంత్రిస్తుంది. ఈ ఆటోమేటిక్ ఆక్సీమీటర్ వినియోగం ద్వారా అవసరమైనంత మాత్రమే ఆక్సిజన్‌ను అందిం చొచ్చు. ఆక్సిజన్‌ను 30 నుంచి 40 శాతం ఆదా చేయొచ్చని డీఆర్డీవో వివరించింది. పరిమితులను ముందుగానే నిర్ధారించడం ద్వారా ఈ ఆక్సీ మీటర్లను ఉపయోగిస్తున్న రోగులను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఆక్సీమీటర్ పనిచేయని పక్షంలో అలారం మోగి, వైద్య సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఇళ్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నింటిలోనూ వీటిని వాడుకోవచ్చని వివరించింది. -
కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం?
దేశంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తుంది. ఈ కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుండటంతో చాలా మంది కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ఏకంగా మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా సోకిన వారి శరీరంలో ఆక్సిజన్ ఎంత స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే వైద్యులు వారికి సకాలంలో ఆక్సిజన్ అందించడం ద్వారా వారిని కాపాడవచ్చు. ఆసుపత్రులలో అయితే ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. అయితే, హోమ్ ఐసోలెషన్‌లో ఉన్న కరోనా భాదితులు తప్పనిసరిగా పల్స్ ఆక్సీమీటర్ పరికరాన్ని తీసుకోవాలి. దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవచ్చు. అయితే వీటి వాడకంపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి రీడింగ్ ను తప్పు చూపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వీటి పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. పల్స్ ఆక్సీమీటర్ అనేది చేతిలో ఒదిగిపోయే ఒక చిన్న పరికరం. చూడటానికి క్లిప్‌లా కనిపించే ఈ పరికరాన్ని ఎక్కువ శాతం కుడి చేతి మధ్య వేలికి లేదా చూపుడు వేలికి అమరుస్తారు. దీన్ని కొన్ని సార్లు మిగతా వెళ్లకు, కాలి వేళ్లు, చెవికి తక్కువ సందర్బాలలో అమరుస్తుంటారు. దీని వల్ల గుండె నుంచి శరీరంలోని మిగతా భాగాలకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తుంది అనేది ఆక్సీమీటర్‌తో తెలుసుకోవచ్చు. కేవలం కరోనా కోసం మాత్రమే కాకుండా ఆస్థమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త హీనత, గుండె జబ్బుల చికిత్సలో దీని అవసరం ఎక్కువ ఉంటుంది. దీనిని వేలికి పెట్టుకున్న కొన్ని సెకన్ల తర్వాత వారి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని ఇది నమోదు చేస్తుంది. ఇది Spo2 యూనిట్లలో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుంది. ఆరోగ్యవంతుల ఆక్సిజన్ స్థాయి 95 శాతం, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆక్సీమీటర్ చేతికి పెట్టుకున్నాక 3 నిమిషాల పాటు 95 శాతం కంటే ఎక్కువ ఒకే రీడింగ్ చూపిస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. ఆ పరికరంలో బ్యాటరీ తక్కువ ఉన్న సమయాలలో రీడింగ్ తప్పుగా చూపించే అవకాశం ఉంది. అలాగే, ఈ పరికరం గుండె కొట్టుకునే రీడింగ్‌ని కూడా మనకు చూపిస్తుంది. ఆరోగ్యవంతులకు నిమిషానికి 60 నుంచి 100 సార్లు హార్డ్ బీటింగ్ ఉంటుంది. పల్స్ ఆక్సీమీటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం మంచిది. గతేడాది కరోనా సోకి, హోమ్ ఐసోలెషన్‌లో ఉన్న రోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆక్సీమీటర్‌ను ఉచితంగా అందించింది. చదవండి: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?