తప్పులో కాలేసిన ఆనంద శర్మ
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ నాయకుడు ఆనంద్ శర్మ తప్పులో కాలేయడంతో నవ్వులు విరిసాయి. సభలో కేంద్ర మంత్రులు లేరనే అంశాన్ని జీరో అవర్ లో ఆయన లేవనెత్తారు. అయితే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్చాంద్ గెహ్లాట్ సభలో ఉండడం ఆయన గమనించలేదు.
తాను సభలో ఉన్నానంటూ గెహ్లాట్ చెప్పడంతో శర్మ గతుక్కుమన్నారు. చాలా సేపటి నుంచి సభలో తాను ఉన్నా కేంద్రమంత్రులెవరూ లేరనడం న్యాయమా అని శర్మను గెహ్లాట్ ప్రశ్నించారు. దీంతో శర్మతో సహా సభలోని వారందరూ చిరునవ్వులు నవ్వారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కూడా శర్మను ఈ విషయంపై అడగ్గా.. గెహ్లాట్ గురించి అంతగా ఎవరికీ తెలియదంటూ సమాధానమిచ్చారు.