విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఈఆర్పీ ప్రారంభం
ఉక్కునగరం(విశాఖపట్నం), న్యూస్‌లైన్: విశాఖ స్టీల్‌ప్లాంట్ మరో మైలురాయిని దాటింది. ప్రతిష్టాత్మక ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)ని ప్రారంభించింది. ఈఆర్పీ అమలు చేసే భారీ ప్రభుత్వరంగ సంస్థలు, బహుళజాతి సంస్థల జాబితాలో విశాఖ స్టీల్‌ప్లాంట్ చేరింది.
శనివారం ఉక్కు మార్కెటింగ్ విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎండీ పి.మధుసూదన్ మొదటి అమ్మకపు ప్రతిని మెసర్స్ కండో ఇండస్ట్రీస్ ప్రతినిధికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉత్పత్తి నుంచి సరుకు విడుదలయ్యే వరకు లోపరహిత పద్ధతిలో నిర్వహించే ఈఆర్పీ విధానం ప్రస్తుత పోటీ ప్రపంచంలో కీలకపాత్ర వహిస్తుందన్నారు.