'చంద్రబాబు హామీలు నిలుపుకోవాలి'
విజయనగరం: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినా.. తానేమీ దోచుకోలేదు... దాచుకోలేదని తెలిపారు. తానెప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు.