ఇంగ్లండ్ 179/4
► దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను పేసర్ స్టెయిన్ (3/29) దెబ్బతీశాడు. కెప్టెన్ కుక్(0), రూట్ (24) విఫలమయ్యాడు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జేమ్స్ టేలర్ (70), కాంప్టన్ (63 బ్యాటింగ్) జట్టును నిలబెట్టారు. క్రీజులో కాంప్టన్తో స్టోక్స్ (5 బ్యాటింగ్) ఉన్నాడు.