pachayathi
-
ఇక పాఠశాలల బాధ్యత పంచాయతీలదే!
సాక్షి, అదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు కట్టబెట్టనున్నారు. ప్రభుత్వ బడులను స్వచ్ఛ పాఠశాలలుగా మార్చే ఉద్దేశంతో ఇన్నాళ్లు ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తున్న బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రకటించారు. పాఠశాలలు మెరుగుపడే అవకాశం.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 102 ఉన్నాయి. వీటిల్లో 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలల్లో నూతన సిబ్బంది నియామకాలు లేకపోవడంతో స్వీపర్లు, పారిశుధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బడుల ఆవరణలు పిచ్చిమొక్కలు, అపరిశుభ్రతతో నిండిపోతున్నాయి. కొన్ని పాఠశాల ఆవరణల్లో పశువులు సంచారం చేస్తున్నాయి. సిబ్బంది సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. జిల్లా విద్యా శాఖ తాత్కాలిక పద్ధతిలో కొంతమంది సిబ్బందిని నియమించినా.. తక్కువ వేతనాలు కావడంతో పని చేయడానికి వారు ఆ సక్తి చూపడం లేదు. కాగా పాఠశాలల పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో స మస్య తీరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చూసేవారు. ఈ విద్యా సంవత్సరం నుంచే.. కరోనా తగ్గుముఖం పడితే మొదట ఉన్నత పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట డిజిటల్ తరగతులు, ఆ తర్వాత ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు తెరవలేదు. బడులు తెరిచిన తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలల్లో నూతన విధానం అమలు చేసి పారిశుధ్య కార్యక్రమాలు ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అధికారులు నిర్వహించనున్నారు. ఆదేశాలు రావాల్సి ఉంది పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. పూర్తిస్థాయి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాలలు తెరుచుకునే నాటికి వచ్చే అవకాశం ఉంది. – రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
నేడు మలివిడత పంచాయతీ పోలింగ్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో మలి విడత పంచాయతీ పోరుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేపాడ మండలం గుడివాడ, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానాలతో పాటు జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీల్లో ఏడు వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు నలుగురు, వార్డు మెంబర్ స్థానాలకు 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించటం తో పాటు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అదే రోజున ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. పోలింగ్‌ను సంబంధిత మండలాభివృద్ధి అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించారు. గత సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు పంచాయతీ, 75 వార్డు స్థానాలకు ఈ నెల 3 నుంచి ఆరో తేదీ వరకు అభ్యర్థుల నుం చి నామినేషన్లు స్వీకరించగా మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యా యి. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి బరిలో కేవలం 18 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు ఇందులో సర్పంచ్ స్థానాలకు నలుగురు, వార్డు స్థానాలకు 14 మంది పోటీపడుతున్నారు. ఆ రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు లేనట్లే...! కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. వీటికి నామినేషన్లు దాఖలుకాకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థిత్వానికి సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపులు సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో తాము చేసేదేమీ ఉండదని, మరోసారి రెండు సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. -
లైన్ క్లియర్
=మున్సిపాలిటీల ఫైలుపై మంత్రి మహీధర్ సంతకం =35 పంచాయతీలను డీనోటిఫై చేయాలని పీఆర్‌కు లేఖ =నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలో కొత్త మునిసిపాలిటీలు/నగర పంచాయతీలు రానున్నాయి. 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ప్రభుత్వం... వాటిని గ్రేటర్లో కలిపే అంశంలో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లి, కాల్వంచ గ్రామాలు మినహా.. మిగతావాటిని మున్సిపాలిటీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖలో విలీనం చేసుకుంటున్న గ్రామాలను డీనోటిఫై చేయాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖకు ఫైలు పంపారు. అక్కడి నుంచి ఫైలు ముఖ్యమంత్రి దరికి చేరనుంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి... శివారు పంచాయతీలు కాస్తా మున్సిపాలిటీలుగా/నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలివే: శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, కొంపల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, కొత్తపేట, జల్పల్లి, బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం -
నేడు వైఎస్సార్ సీపీ బహిరంగ సభ
= పార్టీ జిల్లా అగ్రనాయకుల రాక =పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలి : చెవిరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మం గళం బీటీఆర్కాలనీలో ఆదివారం వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగనుంది. ఉదయం 11గంటలకు జ రిగే ఈ సభను విజయవంతం చే యా లని పార్టీ శ్రేణులకు చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ కన్వీనర్ రుద్రగోపి, అశోక్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ నాయకులు సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను చెవిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పా ర్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థారుు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతి రేక వి ధానాలను ఎలా తిప్పి కొట్టాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగానే జిల్లాలోని పార్టీ అగ్రనాయకులు, సమన్వయకర్తలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, తిరుపతి ఎ మ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు అమరనాథ్‌రెడ్డి, ఏఎస్ మనోహర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బియ్య పు మధుసూదన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారని తెలి పారు. ఈ సభకు ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. -
పగబట్టిన ‘పంచాయతీ’
మక్తల్ రూరల్/గట్టు, న్యూస్‌లైన్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఇంకా పగలు, ప్రతీకారాలు పొడచూపుతూనే ఉన్నాయి. విజేతలు, పరాజితుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండే కక్షలు రగిలిపోతున్నాయి. ఈ కోవలోనే మక్తల్ మండలం కర్నీ గ్రామంలో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో విజేతగా నిలిచిన సర్పంచ్‌గా అభ్యర్థి విజయాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడికి చెందిన బైక్, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు..ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా రాఘవేందర్ గౌడ్ గెలుపొందారు. ఆయనకు అదే పార్టీ నాయకుడు మల్లేశ్వర్‌రెడ్డి పూర్తి మద్దతు తెలిపి భుజస్కందాలపై బాధ్యతను వేసుకుని రాఘవేందర్‌గౌడ్‌ను గెలిపించారు. నాటి నుంచి ప్రత్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని స్థానికులు చెప్పారు. ఇదిలాఉండగా సోమవారం రాత్రి గ్రామంలోనే మల్లేశ్వర్‌రెడ్డి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్, ట్రాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇది గమనించిన ఆయన ఇంట్లోనుంచి బయటివచ్చి మంటలను ఆర్పివేసేలోగా వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి. అయితే తెల్లవారేసరికి ఇంటి ముందు పెద్దఎత్తున గుమిగూడటంతో గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ మక్తల్ పోలీసులకు మల్లేశ్వర్‌రెడ్డి ఫోన్‌ద్వారా సమాచారమందించారు. ఎస్ఐ మురళి పోలీసు బందోబస్తుతో కర్ని గ్రామానికి ఘటనస్థలాన్ని పరిశీలించారు. కొందరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు బాధితుడు మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసునమోదు నమోదుచేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు. గట్టు ఉప సర్పంచ్ ఎన్నికలో బాహాబాహీ గట్టు, న్యూస్‌లైన్: మంగళవారం జరిగిన గట్టు ఉప సర్పంచ్ ఎన్నిక వార్డుసభ్యుల మధ్య సిగపట్లకు దారితీసింది. పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టు సర్పంచ్‌గా వైఎస్ఆర్ సీపీ మద్దతుతో సంతోషమ్మ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు ఏడుగురు సభ్యులు వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలుపొందారు. ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో, ఒకరు టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. అయితే కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలాఉండగా కాంగ్రెస్, టీడీపీ వార్డు సభ్యులు ఏకం కావడంతో వారి సంఖ్య ఏడుగురికి పెరిగింది. రెండు సమానమైన సందర్భంలో సర్పంచ్ ఓటుతో ఉప సర్పంచ్ పదవి సర్పంచ్ వర్గానికి వెళుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లిన వైఎస్ఆర్ సీపీ మద్దతుతో వార్డుసభ్యుడిగా గెలుపొందిన మల్లేష్‌ను కిడ్నాప్ చేశారు. మంగళవారం ఉపసర్పంచ్ ఎన్నిక తరుణంలో మల్లేష్ కనిపించకుండాపోవడంతో వైఎస్ఆర్ సీపీ శిబిరంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో వార్డుసభ్యులు సిగపట్లకు దిగారు. అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఇంతలో కనిపించకుండాపోయిన మల్లేష్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమవడంతో కథ సుఖాంతమైంది.