PACL Company
-
రూ. 60,000 కోట్ల మోసం.. ఆ సంస్థ ఆస్తి లావాదేవీలతో జాగ్రత్త: సెబీ వార్నింగ్
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తుల లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రజలను హెచ్చరించింది. ఆయా ఆస్తుల విక్రయానికి ఎవరికీ అనుమతులు లేవని స్పష్టం చేసింది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో పీఏసీఎల్ (పెర్ల్ గ్రూప్) ప్రజల నుంచి నిధులు సమీకరించిన సంగతి తెలిసిందే. సెబీ గణాంకాల ప్రకారం గడిచిన 18 ఏళ్లలో సమిష్టి పెట్టుబడుల స్కీముల (సీఐఎస్) ద్వారా పీఏసీఎల్ మోసపూరితంగా రూ. 60,000 కోట్లు సమీకరించింది. వీటిని ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వాలన్న ఆదేశాలను పాటించనందుకు గాను కంపెనీ, దాని తొమ్మిది మంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు 2015లో సెబీ ఆదేశాలు ఇచ్చింది. ప్రాపర్టీల విక్రయం, రిఫండుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2016లో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే దశలవారీగా రిఫండు ప్రక్రియ ప్రారంభించింది. అయితే, కర్ణాటకలోని పీఏసీఎల్ ఆస్తులను విక్రయించేందుకు హర్విందర్ సింగ్ భంగూ అనే వ్యక్తికి కమిటీ నోడల్ అధికారి అనుమతులు ఇచ్చారంటూ నకిలీ లేఖ ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో కమిటీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీకి మార్గదర్శకాలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎస్ఎస్ఈ) మార్గదర్శకాలను నోటిఫై చేసింది. తద్వారా నిధుల సమీకరణలో సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అదనపు అవకాశాలు ఏర్పడనున్నాయి. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్, టెక్నికల్ గ్రూప్ చేసిన సిఫారసుల ఆధారంగా సెబీ మార్గదర్శకాలను రూపొందించింది. దేశీయంగా ఎస్ఎస్ఈ అనేది కొత్త ప్రతిపాదనకాగా.. ప్రయివేట్, నాన్‌ప్రాఫిట్ రంగాలకు భారీగా నిధులు లభించేందుకు వీలుంటుంది. ఎస్ఎస్ఈ ఆలోచనను 2019–20 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి వెల్లడించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఎస్ఎస్ఈ.. ప్రస్తుత స్టాక్ ఎక్స్చేంజీల నుంచి ప్రత్యేక విభాగంగా ఏర్పాటుకానుంది. ఇందుకు సెబీ నోటిఫికేషన్స్‌ను జారీ చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయ్యేందుకు నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్(ఎన్‌పీవోలు)సహా సామాజిక లక్ష్యాలుగల సంస్థలకు అవకాశముంటుంది. సెబీ ధృవీకరించిన 16 రకాల బోర్డు కార్యకలాపాలలో భాగమైన సంస్థలకు ఎక్సే్ఛంజీలో పార్టిసిపేట్ చేసేందుకు అనుమతిస్తారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య పరిరక్షణకు ప్రోత్సాహం, విద్యకు మద్దతు, ఉపాధి కల్పన, పోషకాహారం, సమానత్వానికి ప్రాధాన్యం వంటి కార్యకలాపాలను సెబీ లిస్ట్ చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
పీఏసీఎల్ : ప్రముఖ గాయకుడికి సెబీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్‌కు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన లిమిటెడ్ (పీఏసీఎల్) నుంచి కొనుగోలు చేసిన ముంబైకి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జాత్‌లో నిగమ్ ఫామ్‌హౌస్ విక్రయంపై నిషేధం విధించింది. అలాగే గత 18 సంవత్సరాలుగా సమిష్టి పెట్టుబడి పథకాల ద్వారా పెట్టుబడిదారుల నుండి అక్రమంగా రూ .60,000 కోట్లకు పైగా వసూలు చేసిన పీఏసీఎల్‌పై సెబీ అనేక ఆంక్షలు విధించింది. ఆస్తుల విక్రయం, బదిలీలకు అనుమతిని నిరాకరించింది. మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విక్రయాన్ని లేదా బదిలీ చేయడాన్ని అడ్డుకుంటూ సెబీ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సోనూ నిగంతోపాటు వైటల్ సీ మార్కెటింగ్‌కు చెందిన స్థిర, చర ఆస్తుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి 9 తేదీన ఆదేశించింది. పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడానికి మరియు అమ్మకపు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అప్పగించిన పీఏసీఎల్ కమిటీకి, జనవరి 15, 2018న ఫాం హౌస్‌ను సోనూ నిగమ్ కొనుగోలు చేసిన వివరాలపై కమిటీకి తెలియజేస్తూ జాన్ కల్యాణ్ ట్రస్ట్ ఏప్రిల్ 2018 లో ఒక లేఖ రాసింది. పీఏసీఎల్ అనుబంధ సంస్ధ వైటల్ సీ మార్కెటింగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. అయితే 99 శాతానికి పైగా మూలధనం వాటా నేరుగా దాని 21 అసోసియేట్ కంపెనీలు నియంత్రిస్తాయని పీఏసీఎల్ 2018 మేలో ప్రత్ర్యేక కమిటీకి అందించిన సమాచారంలో తెలిపింది. దీని ప్రకారం, తమ అసోసియేట్ సంస్థ వైటల్ సీ మార్కెటింగ్ ఆస్తులను ఎటాచ్ చేయాలని సెబీని కోరింది. కాగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట ప్రజల నుంచి పీఏసీఎల్ అక్రమంగా రూ. 60వేల కోట్లు సమీకరించిందని తేలిన నేపథ్యంలో ఆగస్టు 22, 2014 నాటి ఉత్తర్వులలో డబ్బును తిరిగి చెల్లించాలని పీఏసీఎల్, దాని ప్రమోటర్లు డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. అయితే డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్, దాని తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల అన్ని ఆస్తులను అటాచ్ చేయాలని 2015 డిసెంబర్లో ఆదేశించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కూడా సంస్థ ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో సెబీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సంగతి తెలిసిందే. చదవండి: డెక్కన్ క్రానికల్ చైర్మన్‌పై సెబీ నిషేధం -
పీఏసీఎల్ ఆస్తులతో లావాదేవీలొద్దు
జస్టిస్ లోధా కమిటీ హెచ్చరిక న్యూఢిల్లీ: పీఏసీఎల్ కంపెనీ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని జస్టిస్ ఆర్.ఎం. లోధా అథ్యక్షతన గల కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్ గ్రూప్ కంపెనీల, అనుబంధ కంపెనీల సంబంధిత ఆస్తులను, కొనుగోలు చేయడం విక్రయించడం, మరే ఇతర తరహా లావాదేవీలనైనా నిర్వహించడం చేయరాదని ఈ కమిటీ పేర్కొంది. ఇలాంటి లావాదేవీలను నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమైనదిగా భావించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ విధమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని వివరించింది. ఎవరి సొమ్ములు వారికివ్వడానికే...: పీఏసీఎల్ సంస్థ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులను సమీకరించింది. 18 ఏళ్లుగా ఈ కంపెనీ అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి రూ.49,000 కోట్లు సమీకరించిందని సెబీ గుర్తించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఇన్వెస్టర్లకు వారి సొమ్ములను వారికి తిరిగి చెల్లించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇన్వెస్టర్లకు వారి డబ్బులు వారికి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను నిర్వహిస్తోంది.