ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న ప్రియురాలు
తూప్రాన్ : ప్రేమించిన యువతి పెళ్లిని అడ్డుకోవడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన సంఘటన మండలంలోని పడాల్పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పడాల్పల్లి గ్రామానికి చెందిన పంబాల యాదగిరి పెద్ద కుమార్తె శిరీషకు మండలంలోని యావపూర్ గ్రామానికి చెం దిన నీల రాములు కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయమైంది.
ఈ క్రమంలోనే 9న శుక్రవారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు శంకర్ బంధువులతో కలిసి ఊరేగింపుగా పడాల్పల్లిలోని పెళ్లింటికి చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడి మాజీ ప్రియురాలు విజయ గ్రామానికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. తనను కాదని మరో యవతిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారని అక్కడి పెద్దలను నిలదీసింది.
అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పెళ్లి కుమారుడు శంకర్ గతంలో యావపూర్ గ్రా మానికి చెందిన ధర్మారం విజయను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడం టూ బాధితురాలు స్థానిక పోలీస్స్టేష న్లో గత ఏడాది ఆగస్టు 5న ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయగా, కేసు విచారణలో ఉంది.
ఇదిలా ఉండగా.. శుక్రవారం పెళ్లి విషయం తెలుసుకున్న విజయ పడాల్పల్లి గ్రామానికి చేరుకుని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులకు గ్రామస్తులు తెలుపడంతో ఎస్ఐ - 2 వీరబాబు సిబ్బందితో సం ఘటనా స్థలానికి చేరుకుని విజయను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కౌ న్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
ఇదిలా ఉంటే పెళ్లి కుమారుడు, బంధువులు అక్క డి నుంచి జారుకున్నారు. దిలా ఉండ గా.. పెళ్లి కుమార్తె శిరీషకు సమీపబంధువైన వెల్దుర్తి మండలం నెల్లూరుకు చెందిన అబ్బాయితో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు వివాహం జరిగింది.