సూర్య చిత్రంలో నీలాంబరి
పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను మరవలేం. ఇక చాలా కాలం తరువాత బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో జీవించారు. తాజాగా నటుడు సూర్య చిత్రంలో మరో ప్రధాన పాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానా సేర్న్ద కూటం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత సీనియర్ కమేడియన్ సెంథిల్ నటిస్తున్న ఈ చిత్రంలో నటి రేవతి మాజీ ప్రియుడు సురేశ్‌మీనన్, ఆర్జే.బాలాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ధ్రువీకరించారు. తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌తో ఉన్నానంటున్నారీ నీలాంబరి.
ఆమె మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్‌శివ కథ వినిపించగానూ చాలా నచ్చేసిందన్నారు. తన పాత్ర గురించి ఏమిటన్నది చెబితే కథ ప్రధానాంశం తెలిసిపోతుంది. ఇప్పటికీ తానా విషయాన్ని చెప్పలేనన్నారు. అరుుతే ఇందులో సూర్యతో తనకు డెరైక్ట్ కనెక్షన్ మాత్రం ఉండదన్నారు.అలాగే తానాసేర్న్‌ద కూటం చిత్రంలోని ప్రధాన పాత్రల్లో తనది ఒకటన్నారు. ఈ చిత్రం కోసం రమ్యకృష్ణ 35 రోజులు కాల్షీట్స్ కేటారుుంచినట్లు సమాచారం. ప్రస్తుతం రమ్యకృష్ణ విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా శభాష్‌నాయుడు చిత్రంలోనూ, బాహుబలి-2 చిత్రంలోనూ నటిస్తున్నారు. పంచతంత్రం చిత్రం తరువాత కమలహాసన్‌తో నటిస్తున్న శభాష్‌నాయుడులో వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు.