సీమాంధ్ర రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు డిపోలకే పరిమితమై, రైళ్లలో రద్దీ పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలుగా అదనపు బోగీలను ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు.. తాజాగా 424 అదనపు బోగీలను ఏర్పాటు చేయటం ద్వారా 30,400 బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వినాయక చవితి నేపథ్యంలో ఆదివారం నుంచే అదనపు బోగీలను అందుబాటులోకి తెస్తున్నట్లు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.
వీటికే అదనపు బోగీలు..
సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు 12 నుంచి 20వ తేదీ వరకు, తిరుగుప్రయాణంలో 13 నుంచి 21 తేదీ వరకూ ప్రతీరోజూ.. అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు.
సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 10, 11, 17, 18 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 11, 12, 18, 19 తేదీల్లో...
కాచిగూడ-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో...
తిరుపతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో అదనపు బోగాలు ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో...
సికింద్రాబాద్-తిరుపతి సెవన్‌హిల్స్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 10, 13, 17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 16, 20 తేదీల్లో...
తిరుపతి-కరీంనగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 11, 14, 18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 15, 19 తేదీల్లో అదనపు బోగీలు వేస్తారు.
కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో...
హైదరాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 22 తేదీల్లో...
తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో...
కాచిగూడ- చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో...
నాందేడ్-ముంబై తపోవన్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో అదనపు బోగీలు వేస్తారు.
గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 10, 20 తేదీల్లో...
కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 23 తేదీల్లో...
చెన్నై ఎగ్మోర్- కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 21 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 22 తేదీల్లో...
నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 11, 21 తేదీల్లో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తారు.
నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య రేపు ప్రత్యేక రైలు..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్-హైదరాబాద్ మధ్య సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరే ఈ రైలు (నెం.07255) మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.