Pakistan ISI
-
హైదరాబాద్‌లో హైటెన్షన్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్‌గా ఉగ్రదాడి ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ ఉగ్ర కుట్ర ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జాహిద్ అరెస్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేసింది. హైదరాబాద్‌లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులకు సైతం ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందిన్నట్టు గుర్తించారు. దాడులు చేసేందుకు నాలుగు గ్రనేడ్స్‌ను జాహిద్‌కు పంపిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ పంపించారు. సోదాల్లో భాగంగా నిందితుల నుంచి 4 గ్రనేడ్లతో పాటు రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. జాహిద్‌తో పాటు మరో ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమీయుద్దీన్, అదీల్, అప్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషిను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందినట్టు తెలుసుకున్నారు. కాగా, గతంలో పలు బ్లాస్ట్ కేసుల్లో అబ్దుల్ జాహిద్ నిందితుడిగా ఉన్నాడు. 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై సూసైడ్ అటాక్‌కు జాహిద్ ప్లాన్ చేశాడు. ఫర్హతుల్లా ఘోరీ, అణు హంజాల, అబ్దుల్ మజీద్‌లతో కలిసి కుట్ర చేశారు. 2002 సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్ద కుట్రకు ప్లాన్ చేశారు. 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ మానవ బాంబు పేలుళ్లను సైతం జాహిద్ ప్లాన్ చేశాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ జాహిద్ ఉగ్ర కుట్రలు చేస్తున్నాడు. -
కశ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపించండి!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పంపించాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు భారత వ్యతిరేక శక్తులకు మరింత సాయమందించాలని సూచించిందని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ ప్ర భుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల, ఈ ప్రాం తంలో భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కిం గ్స్ ఉన్నట్లు గుర్తించారు. చొరబాట్లకు వీలు లేకుం డా భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు సాద్యం కావడంలేదు. దాంతో, ఎట్టి పరిస్థితుల్లో శీతాకాలం ప్రారంభమయ్యేలోపు సాధ్యమైనంత భారీ స్థాయిలో ఉగ్రవాదులను, ఆయుధాలను కశ్మీర్‌లోయలోకి పంపించాలని ఐఎస్ఐ భావిస్తోంది. నియంత్రణ రేఖ వెంట చొరబాట్లను అడ్డుకునే ఒక సమర్ధవంతమైన ప్రణాళికను భారత భద్రతాదళాలు రూపొందించాయి. గత 10 రోజుల్లో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా, సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి కశ్మీర్లో పర్యటించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘చొరబాటుదారుల విషయంలో భారత బలగాలు వ్యవహరించే తీరును ఐఎస్ఐ అధ్యయనం చేసింది. సాధారణంగా ఆయుధం లేకుండా, ఎవరైనా చొరబాటుకు ప్రయత్ని స్తే.. భారత బలగాలు కాల్పులు జరపవు. అందువల్ల ఆయుధాలు లేకుండా, చొరబాటుదారులను పంపించడం, ఆ తరువాత డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా ఆయుధాలను పంపించడం.. అనే వ్యూహాన్ని వారు ప్రారంభించారు. దానివల్ల చొరబాటుదారులు నియంత్రణ రేఖ వద్దనే కాల్చివేతకు గురయ్యే పరిస్థితి ఉండదు’ అని పాక్ ఆలోచనను పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలో భారత వ్యతిరేక రిక్రూట్మెంట్లు పెరిగాయి. అయితే, వారికి ఆయుధాలు సమకూర్చడం సమస్యగా మారింది. అందువల్ల డ్రోన్లు, క్వాడ్కాప్టర్ల ద్వారా ఆయుధాలు పంపించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. -
పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి
-
పాక్ కుట్రను తిప్పికొట్టిన భారత్!
సాక్షి, అమృత్సర్: పాకిస్తాన్ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. డబ్బు ఆశ చూపి భారత యువతను గూఢచారులుగా నియమించుకుంటుంది. భారత నిఘా వ్యవస్థను అస్థిర పరచడానికి పాక్ చేస్తోన్న ఈ ప్రయత్నాలను భారత అధికారులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐకి గూఢచారిగా వ్యవహరిస్తున్న అమృత్‌సర్‌కి చెందిన రవి కుమార్‌ని మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో పంజాబ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు నెలల క్రితమే అతన్ని ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐ రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. పంజాబ్‌లోని ముఖ్యమైన సంస్థలు, నిషేధిత ప్రాంతాలు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ కదలికలు, కొత్త బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని అతడు పాక్‌కి చేరవేస్తున్నాడు. ఇంటర్నెట్ ద్వారా ఫొటోలు, ఎస్ఎంఎస్లు పంపుతూ నిరంతరం పాక్ ఐఎస్ఐతో టచ్‌లో ఉంటున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఐఎస్ఐ ఎజెంట్లు దుబాయ్ నుంచి రవి అకౌంట్‌కి డబ్బును పంపిస్తున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు రవి దుబాయ్‌లో గడిపాడని అక్కడే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలను అతడికి వివరించినట్టు తెలుస్తోంది. రవి కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా అతడికి ఏయే గ్రూపులతో, ఎవరితో సంబంధాలున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా ఉగ్రవాదంపై ప్రేరేపిస్తున్నాయని, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు యువతను హెచ్చరించారు. -
నోట్లరద్దుతో పాక్ ఐఎస్ఐ కొత్త కుయుక్తులు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తనవద్ద పెద్దమొత్తంలో ఉన్న భారత కరెన్సీని మార్చుకోవడానికి తెరచాటు యత్నాలకు దిగుతున్నట్టు సమాచారం. తన వద్ద ఉన్న పాత కరెన్సీని ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున మార్చుకునేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో దేశంలోని బ్యాంకులన్నింటినీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో డిపాజిట్ అయ్యే నగదు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోకి పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని తరలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఐఎస్ఐ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’
శివమొగ్గ, న్యూస్‌లైన్ : ముస్లిం యువకులకు పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నాయంటూ ఏఐసీసీ జాతీయ ఉధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం సోషియల్ డెమెక్రటిక్ పార్టీ ఆప్ ఇండియా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యూపీలోని ముజఫర్ నగర్లో ఇటీవ ల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో రాహుల్ ఇలాంటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సమంజసం కాదని ఎస్డీపీఐ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఎస్డీపీఐ జిల్లా అధ్యక్షుడు విజాన్‌పాషా మాట్లాడుతూ ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ముజఫర్ నగర్ సంఘటనను ప్రస్తావిస్తూ ముస్లిం యువకులు పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థతతో సంబంధాలు ఉన్నాయంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముజఫర్‌నగర్ బాధితులకు ప్రభుత్వం సాయం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్ ముజఫర్‌నగర్ సంఘటనను రాజకీయ స్వార్థానికి వాడుకుని పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ వివాదాస్పద రాజకీయాలకు, కాంగ్రెస్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. తక్షణం రాహుల్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని, లేకుం టే భవిష్యత్‌లో భారీ ఆందోళనలు చేపడతామని విజాన్‌పాషా హెచ్చరించారు. ధర్నాలో ఎస్డీపీఐ కార్యకర్తలు బషీర్‌అహ్మద్, అబ్దుల్ ముజీద్, మహమ్మద్‌నాజీమ్, రాజిక్‌పాషా, అల్లాబక్ష్, ఖలీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.