breaking news
Pakistan vs UAE
-
Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం
ఆసియా కప్-2025లో పాల్గొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టులో ఆ దేశంలో పుట్టినవారు కాకుండా వలస వచ్చిన ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఐదుగురు భారత్‌కు చెందినవారు కాగా, మరో ఐదుగురు పాకిస్తానీలు.ఇక ఈ టోర్నీలో టీమిండియా- పాక్ జట్ల మధ్య తాజా ‘షేక్ హ్యాండ్’ వివాదం నేపథ్యంలో యూఏఈ టీమ్‌లో ఉన్న ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగింది. అయితే కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ ఈ మొత్తం అంశాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. భారత్, పాక్ మధ్య ఏం జరిగినా తమకు సంబంధం లేదని, తామంతా యూఏఈ జట్టు ఆటగాళ్లం మాత్రమేనని అతడు స్పష్టం చేశాడు.ఇక వసీమ్ స్వయంగా పాకిస్తాన్‌లోని ముల్తాన్‌కు చెందిన వాడు కాగా...హైదర్ అలీ, జునైద్, రోహిద్, ఆసిఫ్ ఇతర పాకిస్తాన్ క్రికెటర్లు. భారత్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్, రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, అలీషాన్ షరఫు టీమ్‌లో కీలక సభ్యులు.‘యూఏఈ టీమ్ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటివాళ్లం. ఎవరూ భారతీయుడు కాదు, ఎవరూ పాకిస్తానీ కాదు. భారత్, పాక్ వివాదానికి సంబంధించి మా జట్టులో అసలు ఎలాంటి చర్చా జరగలేదు, జరగదు కూడా. మా టీమ్ సభ్యులంతా కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఒకే కుటుంబంలాగే ఉంటూ ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’ అని వసీమ్ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో విభేదాల నేపథ్యంలో బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌కు పాక్ టీమ్ చాలా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం యూఏఈ అప్పీల్ చేస్తే పాక్ వాకోవర్ ఇచ్చినట్లుగా ప్రకటించి యూఏఈని విజేతగా ఖరారు చేయవచ్చు. అయితే తమకు అలాంటి ఆలోచన ఏమాత్రం రాలేదని మొహమ్మద్ వసీమ్ వెల్లడించాడు. ఇక యూఏఈపై విజయంతో.. టీమిండియాతో పాటు పాక్‌కు సూపర్-4 దశకు అర్హత సాధించిది. గ్రూప్-ఎ నుంచి దాయాదులు తదుపరి దశకు క్వాలిఫై కాగా.. యూఏఈ, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. -
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశలో పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు డకౌట్ అయ్యాడు. ఒమన్, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వెనుదిరిగాడు.అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సయీమ్ ఆయుబ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు‘‘ప్రతి ఒక్కరి కెరీర్లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్‌గా కాకుండా.. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్‌లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్ లతీఫ్ ధీమా వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్.. యూఏఈ, ఒమన్‌లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాక్ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. సూపర్-4 బెర్తు ఖరారుఇక లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. ముందుగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్‌తో మ్యాచ్ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు బాయ్‌కాట్ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడిన పాక్.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు చేరుకుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్UAE strike early vs Pakistan 🤯Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
అందుకే ఆసియా కప్‌లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్‌హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్‌కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్‌ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.అంపైర్‌పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్ అహ్మద్ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్‌లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్‌లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్‌కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్‌కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లుటాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్పాక్ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
Asia Cup 2025: పాక్ 'బాయ్‌కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?! -
‘పసికూన’పై ప్రతాపం.. ఫైనల్లో పాకిస్తాన్
ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఫైనల్ చేరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాక్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ ట్రై సిరీస్‌లో పాక్‌కు ఇది మూడో విజయం ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా (Salman Agha) బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది.కాగా ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ- అఫ్గనిస్తాన్- పాకిస్తాన్ త్రైపాక్షిక సిరీస్ ఆడుతున్నాయి. షార్జా వేదికగా జరగుతున్న ఈ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలుత అఫ్గనిస్తాన్‌ను ఓడించిన పాక్.. తర్వాత యూఏఈపై గెలిచింది. అనంతరం అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన పాక్.. తాజాగా యూఏఈతో రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.ఫఖర్ జమాన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్ (16), సయీమ్ ఆయుబ్ (11) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman) అద్భుత అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 44 బంతులు ఎదుర్కొని.. పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫఖర్ జమాన్‌కు తోడుగా మహమ్మద్ నవాజ్ (27 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడాడు. దీంతో పాక్ మెరుగైన స్కోరు సాధించగలిగింది.యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ రెండు వికెట్లు తీయగా.. జునైద్ సిద్దిఖీ, ముహమ్మద్ రోషిద్ ఖాన్, ధ్రువ్ పరాశర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈకి ఆదిలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ముహమ్మద్ వసీం (19)ను అబ్రార్ అహ్మద్ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు.అలిశాన్ షరాఫూ అర్ధ శతకం వృథాఅయితే, మరో ఓపెనర్ అలిశాన్ షరాఫూ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. కానీ, పాక్ బౌలర్ల విజృంభణతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో షరాఫూ అర్ధ శతకం వృథాగా పోయింది. ఎథాన్ డిసౌజా (9), ఆసిఫ్ ఖాన్ (7), రాహుల్ చోప్రా (0), హర్షిత్ కౌశిక్ (3), జునైద్ సిద్దిఖీ ఇలా వచ్చి అలా వెళ్లగా.. ధ్రువ్ పరాశర్ (15 బంతుల్లో 18 నాటౌట్), హైదర్ అలీ (12- రనౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అబ్రార్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగి.. పసికూనను వణికించాడు. ఇక షాహిన్ ఆఫ్రిది, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఫైనల్లో అఫ్గన్‌తో పాక్ ఢీకాగా ఈ ముక్కోణపు సిరీస్‌లో యూఏఈ శుక్రవారం అఫ్గనిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇక ఆదివారం పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ ఫైనల్లో తలపడతాయి. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్