పాలేరులో ఎన్నికల పరిశీలకుల పర్యటన
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని దానవాయిగూడెం, రామన్నపేట, కైకొండాయిగూడెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వీరికి కలెక్టర్ లోకేశ్‌కుమార్(తాజాగా బదిలీ అయిన) ఆహ్వానం పలికారు. పరిశీలకుల వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయకృష్ణరెడ్డి తదితర అధికారులు ఉన్నారు.