విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు విశాఖ విమానాశ్రయంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమెకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అభిమానులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నగర యువజన విభాగం కన్వీనర్ గుడ్ల పోలిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, గండి బాబ్జీ, జి.వి.రవిరాజు, కోలా గురువులు, కోరాడ రాజబాబు, కుంభా రవిబాబు, చెంగల వెంకట్రావు, వంజంగి కాంతమ్మ, కిడారి సర్వేశ్వరరావు, పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర బీసీ కమిటీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, పార్టీ నాయకులు పీలా ఉమారాణి, అంగ అప్పలరాజు, ప్రభా గౌడ్, గండి రవికుమార్, బట్టు సన్యారావురెడ్డి, నారా నాగేశ్వరరావు, చింతల అప్పలనాయుడు, వల్లిరెడ్డి శ్రీనివాసరావు, పూజారి ఉదయ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు మారుతీ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.