9 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : 2014-15 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ఈనెల సోమవారం నుంచి 16వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కౌన్సెలింగ్ కేంద్ర క్యాంప్ అధికారి యలమర్తి రాజేంద్రబాబు శనివారం తెలిపారు.
జిల్లాలో తణుకు ముళ్లపూడి వెంకటరాయ మమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల, భీమవరం సీతా పాలిటెక్నిక్ కళాశాలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీలు రూ.150 రుసుం చెల్లించాలని చె ప్పారు. కళాశాలల ఎంపిక ప్రక్రియ 12వ తేదీ నుంచి 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు.
వెబ్ కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన పత్రాలివే..
- పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్
- పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డు
- పదో తరగతి మార్కుల మెమో
- స్టడీ సర్టిఫికెట్లు (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)
- కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ)
- పదో తరగతి బదిలీ సర్టిఫికెట్ (టీసీ)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (1.1.2014 తరువాత జారీ చేసింది)