యువకుడు మృతి
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేటని బీడీ కాలనీలోని వ్యవసాయ బావిలో ఈత కొడుతుండగా మూర్ఛ రావడంతో ఒక యువకుడు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్న జరిగింది.
వడ్డెర కాలనీకి చెందిన పల్లెపు శేఖర్(22) కూలిపనులు చేసుకుని జీవించేవాడు. వ్యవసాయ బావిలో ఈతకొడుతుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. దీంతో నీటిలో మునిగి మృతిచెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో మృతి చెందాడు.