ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పల్లికొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో గత అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్‌లోకి ప్రవేశించేందుకు గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసేందుకు వారు ప్రయత్నించగా ఆసమయంలో డోర్లకు మంటలు అంటుకున్నాయి. దాంతో దుండగులు పరారయ్యారు. కాగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.