palnt
-
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు. ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి.. కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్’ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ సిద్ధమవుతోంది. మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి దేశంలోకెల్లా భారీ చైనా పెట్టుబడుల్లో ఒకటిగా దీనిని పరిశ్రమశాఖ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. 5 వేల మందికి ఉపాధి స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక పారిశ్రామిక అనుకూల విధానాలతో అనేక కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందన్నారు. నైపుణ్యం గల మానవవనరులతోపాటు శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమాన, రవాణా సౌకర్యాలు తదితరాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. స్కైవర్త్ భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి: లీ వైడ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని స్కైవర్త్ చైర్మన్ లై వీడ్ తెలిపారు. అత్యుత్తమ నాణ్యతగల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారత్ వ్యూహాత్మక మార్కెట్ అని, స్కైవర్త్ నాణ్య త, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు వినియోగదారుల ఆదరణ పొందినట్లు స్కైవర్త్ ఉపాధ్యక్షుడు వాంగ్ జెంజున్ తెలిపారు. సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభా గం డైరక్టర్ సుజయ్ కారంపురి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ ఈ.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
చంటిబిడ్డల్లా మొక్కల్ని పెంచాలి
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బీ.ఎల్.మిశ్రా మేడికొండూరు : భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.ఎల్.మిశ్రా అన్నారు. మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల గ్రామంలో నగరవనాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా పేరేచర్ల గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నగరవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మొక్కల అవశ్యకతను ప్రతి ఒక్కరూ గమనించుకుని వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని విద్యార్థులను సూచించారు. చిన్నతనంలో చంటిబిడ్డలను తల్లి ఎలా సాకుతుందో మనం కూడా మొక్కలను అలా పెంచాలని వివరించారు. ప్రతినెలా మూడో∙శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ వంటి వాటిపై కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని, వాటిని అమలు చేసేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ వైల్డ్‌లైఫ్ మేనేజర్ రమేష్ కల్వటి, స్పెషల్ సెక్రటరీ పీబీ రమేష్‌చౌదరి, గుంటూరు అటవీ శాఖ అధికారి వీపీఎన్చౌదరి పాల్గొన్నారు.