భూ పంపిణీయే లక్ష్యం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
కొణì జర్ల: తన ఐదేళ్ల పదవి కాలంలో అర్హులైన పేద దళితులందరికీ భూమి పంపిణీ చేయాలన్నదే లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ప్రతిఫల యాత్రలో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో భూ పంపిణీలో లబ్ధిపొందిన గుబ్బగుర్తి పంచాయతీ దళితులతో చర్చించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.395 కోట్లు ఖర్చు పెట్టి 10 వేల ఎకరాల భూమి పంపిణీ చేసిందని, మరో 10 వేల ఎకరాలు సిద్ధమవుతోందని చెప్పారు. కొణిజర్ల మండలంలోనే రూ.4.46 కోట్లతో 22 మంది లబ్ధిదారులకు 65 ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాలలో 1(70) యాక్ట్, గోదావరి డెల్టా ప్రాంతం అధికంగా ఉండటం వల్ల భూమి దొరకడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వారు, భూస్వాములు భూమిని అమ్మడానికి ముందుకు రావాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తే అందులో రూ.800 కోట్లను భూ పంపిణీకే కేటాయించినట్లు వివరించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, అధికారులు, ఉద్యోగులు పిడమర్తి రవిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ శర్మ, తహసీల్దార్ జి.శ్రీలత, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, ఆర్ఐ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.