‘పంచాయతీ’కి రాజకీయ రంగు
చంద్రంపాలెం (సామర్లకోట) : గ్రామ పరిపాలనను అపహాస్యం చేసేలా అధికార పార్టీ వ్యవహరించడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. జనచైతన్య యాత్రల పేరిట చంద్రంపాలెం గ్రామంలో పంచాయతీ కార్యాలయాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ జెండాలతో ముంచెత్తడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ యాత్రలను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుతో పాటు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జేసీ ఎస్.సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు, డీపీఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు మండపాక దొరబాబు, తేజ తెలిపారు.