Pancreatic cancer
-
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్‌ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్‌ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి
కోవిడ్ మహమ్మారి ప్రజలను ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నుంచి సురక్షితంగా బటపడేందుకు బయోఎన్‌టిక్ కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ క్యాన్సర్ మహమ్మారిని రాకుండా కూడా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్ వేసుకున్నట్లే క్యాన్సర్ వ్యాక్సిన్లు వేసుకొవచ్చేనే ఆలోచనకు పురిగొల్పింది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ అటాక్ అయ్యే దశలో ఉన్న వాళ్ల పాలిట ఈ వ్యాక్సిన్ వరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఇది ఏ రకమైన క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతుంది? అధ్యయనంలో కనుగొన్న సరికొత్త విషయలేంటీ?.. కోవిడ్‌కి సంబంధించిన ఎంఆర్ఎన్ వ్యాక్సిన్లపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ సరికొత్త విషయం వెల్లడైంది. ఇది క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి చెందిన డేవిడ్, రూబెన్‌స్టెయిన్ సెంటర్ ఫర్ ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ రీసెర్చ్‌కు సంబంధించిన శాస్త్రవేత్త వినోద్ బాలచంద్రన్ల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ప్యాక్రియాటిక్ క్ అంటే.. జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉండే శరీర అవయవం. ప్యాంక్రియాస్ నిర్వహించే ముఖ్యమైన విధులేంటంటే.. జీర్ణక్రియను సులభతరం చేసే ఎక్సోక్రైన్ ఫంక్షన్, రరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఎండోక్రైన్ పనితీరు. అయితే ఈ అవయవం వెలుపల అసాధారణ కణుతులు వస్తే దాన్ని ప్యాక్రియాటిక క్యాన్సర్ అంటారు. దీని వల్ల ఆహారం అరగదు. నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించటం కష్టం. దీనఇన తొలి దశలో గుర్తిస్తేనే రోగికి చికిత్స అందించి ప్రాణాలను కాపడగలం. అలాంటి ప్రమాకరమైన ప్యాక్రియాటిక్ క్యాన్సర్‌ని ఈ వ్యాక్సిన్ రాకుండా ఆపగలదని చెబుదున్నారు వైద్యులు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్ కణాలను గుర్తించేలా హెచ్చారిస్తాయి. తత్ఫలితంగా ప్యాంక్రియాటిక్ కణితుల్లో కనిపించే నియాయాంటిజన్ ప్రోటీన్లు అలారం గంటలుగా పనిచేసేలా చేసి రోగనిరోధక వ్యవస్థను సమీకరిస్తుంది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే టీ కణాలు నిర్దిష్ట రోగ నిరోదక కణాల ఉత్పత్తిని ప్రేరిపించే లక్ష్యంతో పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. దీంతో రోగుల్లో ఈ క్యాన్సర్ కణితిని సులభంగా గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తొలగించగలుగుతారు వైద్యులు. అంతేగాదు మళ్లీ ఈ క్యాన్సర్ పునరావృత్తం గాకుండా చేస్తుంది డాక్టర్ బాల చంద్రన్ అన్నారు. దాదాపు ఏడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులలో ఎలా పనిచేస్తుందనే ఆలోచనను రేకెత్తించిందని ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అన్నారు వైద్యులు. ఈ టీకాలు సంప్రదాయ టీకాల వలె కాకుండా జన్యు సంకేత విభాగాన్ని ప్రేరేపించి నిర్దిష్ట ప్రోటీన్ ఉత్పతి చేసేలా నిర్దేశిస్తుంది. తద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ ప్యాక్రియాంటిక్ క్యాన్సర్‌ని రాకుండా నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనలు ప్యాంక్రియాంటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు జీవితంపై సరికొత్త ఆశను అందిస్తాయని అన్నారు వైద్యులు. దాదాపు 20 మంది రోగులపై చేసిన క్లినికల్ ప్రయోగాల్లో ఈ చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒకరకంగా పరిశోధనలు వ్యాక్సిన్ల ఆవశక్యత తోపాటు ఇతర క్యాన్సర్లను నివారించేలా మరిన్ని వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే ఆలోచనకు నాంది పలికిందన్నారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సవాలుకు చెక్‌పెట్టేలా చేసి రోగుల జీవితంలో కొత్త ఆశాజ్యోతిని వెలిగించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ కీలకం: పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్‌తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం -
మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత
పాప్ మేనేజర్, పాప్ రారాజు మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ ఇక లేరు. పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న జోయ్(89) లాస్ వేగాస్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. జోయ్ మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్‌లు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. మైకేల్ జాక్సన్ తనయుడు, జోయ్ మనవడు ప్రిన్స్ మైకేల్ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం ఉంచాడు. ‘ అంకితభావానికి మారుపేరు ఈయన. కుటుంబం కోసం ఆయన కష్టమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడిచాడు’ అంటూ జోయ్ ఫోటోను ఉంచాడు. జోయ్ మృతితో ‘జాక్సన్’ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం జోయ్ మృతికి సంతాపం చెబుతున్నారు. 1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జోయ్ జాక్సన్ జన్మించారు. ఆయనకు భార్య కేథరిన్ మరియు 11 మంది సంతానం. వీరిలో పుట్టగానే ఓ బిడ్డ చనిపోగా, మైకేల్ జాక్సన్ 8వ సంతానం. చిన్నతనంలోనే పిల్లలోని మ్యూజిక్ ట్యాలెంట్‌ను గుర్తించిన జోయ్ వారికి బాగా ప్రోత్సహించాడు. వారందరికీ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వారిని ప్రపంచానికి పరిచయం చేశారు. తండ్రిగా కంటే ఓ మేనేజర్‌గానే జోయ్ తమ పట్ల కఠినంగా వ్యవహరించేవారని, ఆ క్రమశిక్షణే తమ ఎదుగుదలకు సహకరించిందని మైకేల్ జాక్సన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పటం చూశాం. పాప్ రారాజుగా వెలుగొందిన మైకేల్ జాక్సన్ (50) 2009, జూన్ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జోయ్ చిన్న కూతురు జానెట్ జాక్సన్(52) కూడా పాప్ దిగ్గజమే. జోయ్‌కు పలు అవార్డులు కూడా దక్కాయి. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
చైనా చెట్టు బెరడుతో క్లోమ కేన్సర్‌కు చికిత్స!
వాషింగ్టన్: చైనాలో నొప్పి నివారణిగా ఉపయోగించే ‘అముర్ కార్క్’ చెట్టు బెరడుతో క్లోమ కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త అద్దంకి ప్రతాప్ కుమార్ నేతృత్వంలోని బృందం కనుగొంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ అయిన ప్రతాప్ కొన్నేళ్లుగా అముర్ బెరడుతో కేన్సర్‌కు మెరుగైన చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఈ చెట్టు బెరడుతో ప్రోస్టేట్ కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని 2011లోనే కనుగొన్న ఆయన తాజాగా క్లోమ కేన్సర్‌కూ సమర్థంగా చికిత్స చేయవచ్చని గుర్తించారు. సాధారణంగా క్లోమ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించిన కణతులు ఏర్పడినప్పుడు వాటి చుట్టూ కణజాల తంతువులు అధికంగా ఉత్పత్తి అయి పొరలా ఏర్పడుతుంటాయి. ఫైబ్రోసిస్ అనే ఈ ప్రక్రియ వల్ల కేన్సర్ కణాలను నిర్మూలించాల్సిన మందులు ఆ కణతుల్లోకి చొచ్చుకుపోలేవు. దీంతో కేన్సర్ కణాల నిర్మూలన కష్టం అవుతోంది. అయితే అముర్ చెట్టు బెరడు నుంచి సేకరించిన ఔషధం కేన్సర్ కణతుల చుట్టూ ఫైబ్రోసిస్ ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటుందని, దీంతో ఔషధాలు సమర్థంగా పనిచేసి చికిత్స విజయవంతం అవుతుందని ప్రతాప్ వెల్లడించారు. దీనిని క్యాప్సూల్స్ రూపంలోనూ ఉపయోగించవచ్చు కాబట్టి.. దుష్ర్పభావాలు ఏమీ ఉండవని తెలిపారు. ఔషధ పరీక్షల్లో భాగంగా 24 మంది రోగుల్లో ఈ ఔషధాన్ని పరీక్షించగా.. అందరిలోనూ చికిత్స విజయవంతం అయిందని పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘క్లినికల్ కేన్సర్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.