papalal
-
పోలీసులు విచారణకు వెళ్తే..
అబిడ్స్: ఆత్మహత్యా చేసుకోవాడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన షాహినాత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చుడిబజార్‌లో చోటు చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం... చుడిబజార్‌లో నివాసం ఉండే పాపాలాల్‌కు స్థానికంగా ఉండే బస్తీవాసులకు కొన్నిరోజులుగా గొడవులు జరుగుతున్నాయి. 15రోజుల క్రితం ఓ మహిళలపై పాపాలాల్ దాడి చేశాడు. అనంతరం ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపాలాల్‌పై 4–సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారం రోజుల క్రితం మరో మహిళ పాపాలాల్‌పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. దీంతో ఈ రెండు కేసుల్లో పాపాలాల్‌ను విచారించేందుకు ఈనెల 28వ తేదీన షాహినాత్‌గంజ్ పోలీసులు పాపాలాల్ ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసి పాపాలాల్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పాపాలాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పాపాలాల్‌పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 12 కేసులు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగర మేయర్ పాపాలాల్‌కు సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే తిరుగుబాటు ఎదురైంది. పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌తో కార్పొరేటర్ల అంతా భేటీ అయ్యారు. మొత్తం 42 మందికి గాను 37 మంది సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఎమ్మెల్యేకి అందించారు. ఈ సందర్భంగా అజయ్ వద్ద కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాపాలాల్ తమ డివిజన్ పర్యటనకు వచ్చిన తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని వాపోయారు. దీనికి స్పందించిన అజయ్‌కుమార్.. తాజా పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పార్టీకి నష్టం చేసే ఎలాంటి చర్యలను కూడా సమర్థించమని స్పష్టం చేశారు. నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్ వ్యవహారాలపై, మేయర్ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వెసులుబాటు కలిగిందని, అవిశ్వాస తీర్మానం చేయాల్సిన పరిస్థితిని డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు వివరించారు. -
జాతీయ సదస్సుకు మేయర్ పాపాలాల్
ఖమ్మం వైరారోడ్ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండో-సాన్ 2016 (స్వచ్ఛభారత్) జాతీయస్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఖమ్మం మేయర్ పాపాలాల్ గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో రాష్ట్రస్థాయిలో ఎంపికైన 12 పట్టణాల్లో (అమృత్ పథకం కింద) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి నగదు ప్రోత్సాహకాను అందజేస్తారు. అలాగే జాతీయస్థాయిలో స్వచ్ఛభారత్ కింద చేపట్టే వివిధ కార్యక్రమాలు, రానున్న రోజుల్లో అనుసరించే విధివిధానాలపై ఉన్నతస్థాయి చర్చ జరుగుతుందని మేయర్ పాపాలాల్ తెలిపారు. -
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో భారీగా అక్రమాలు
- అనర్హులకూ ఆర్థిక సాయం - దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు - ఇప్పటికే షాదీ ముబారక్‌లో 11 కేసులు నమోదు - తూర్పున విస్తృత విచారణ - అక్రమార్కుల్లో వణుకు మంచిర్యాల సంక్షేమ ఫలాలు అక్రమార్కుల పాలయ్యాయి. పేదలకందాల్సిన ఆర్థిక సాయం పక్కదారి పట్టింది. పెళ్లి చేసుకోకుండానే కొందరు.. పెళ్లయి ఏళ్లు గడిచిన తర్వాత ఇంకొందరు.. ఇలా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి డబ్బులు కాజేశారు. మరోపక్క పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేరాల్సిన ఆర్థిక సాయాన్నీ కొందరు కాజేశారు. ఎంతోమంది దళారులు, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకున్నారు. జిల్లాలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల్లోనే షాదీ ముబారక్ పథకంలో అవినీతి నిరోధక శాఖ 11 కేసులు నమోదు చేసింది. తాజాగా.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకుల వివాహాలకు సంబంధించిన కల్యాణలక్ష్మీ పథకంపైనా దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఉట్నూరు, జైనూర్, నార్నూర్, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాల్లో విచారణ పూర్తి చేశారు. మరో రెండ్రోజుల్లో తూర్పు ప్రాంత పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. దళారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ రెండు పథకాల్లో అనర్హులకూ లబ్ధి చేకూర్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. క్షుణ్ణంగా విచారణ..! జిల్లాలో కల్యాణలక్ష్మీ పథకం కింద 3,800 దరఖాస్తులు రాగా.. కేవలం మంచిర్యాల పరిధిలోని నస్పూర్, తీగల్‌పహాడ్, క్యాతన్‌పల్లి ప్రాంతాల నుంచే సుమారు 1500, మంచిర్యాల పట్టణం నుంచి కేవలం నాలుగు దరఖాస్తులున్నాయి. ఇందులో విశేషమేమిటంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలన్నీ సింగరేణి కార్మికులవే కావడం. ఇటు షాదీ ముబారక్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,800 దరఖాస్తులొచ్చాయి. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏళ్ల క్రితం పెళ్లయిన జంటలూ ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఈ రెండూ పథకాల్లో లబ్ధిపొందిన సగానికి పైగా దరఖాస్తులపై ఏసీబీ అధికారులకు అనుమానాలున్నాయి. ఇప్పటికే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథక దరఖాస్తులు, లబ్దిదారుల జాబితాను డివిజన్, నియోజకవర్గం, మండలాల వారీగా సేకరించిన ఏసీబీ అధికారులు సమగ్ర విచారణలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారుడు సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా..? కాదా..? కుటుంబ ఆర్థిక పరిస్థితి..? వివాహం జరిగిన తేదీ ? సంబంధిత ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. అయినా ఎంతోమంది ఆదాయానికి మించి ఆస్తులున్నా పథకం ద్వారా లబ్ధిపొందారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: పాపాలాల్, ఏసీబీ డీఎస్పీ నిరుపేద యువతీ, యువకుల వివాహాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా అనర్హులూ లబ్ధిపొందినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు లబ్ధి చేకూర్చారు. కొందరు ప్రజాప్రతినిధులు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేసి పేదలకందాల్సిన నిధులు కాజేశారు. అలాంటి వారి భరతం పడతాం. రెండు పథకాల లబ్ధిదారుల జాబితాను తీసుకున్నాం. మేమే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపడతాం. అనర్హులు పథకాల ద్వారా లబ్ధిపొందినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం. -
పాపాలాల్ కే పీఠం!
♦ మేయర్‌గా దాదాపు ఖాయం ♦ ‘డిప్యూటీ’పై అధికార పార్టీ తర్జనభర్జన ♦ మేయర్‌గా దాదాపు ఖాయం ♦ ‘డిప్యూటీ’ కోసం కుల సమీకరణ లు ♦ అన్ని పార్టీల్లో ఫ్లోర్లీడర్లపై చర్చ ♦ 15వ తేదీన ప్రమాణ స్వీకారం ఖమ్మం: కార్పొరేషన్ మేయర్ పీఠం అప్పగించే విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందునుంచి మేయర్ అభ్యర్థిగా చెబుతున్న డాక్టర్ పాపాలాల్కే పట్టం కట్టాలని ఆ పార్టీ అధినాయకత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌పై ప్రధాన చర్చ సాగుతోంది. మేయర్ స్థానం ఎస్టీలకు రిజర్వు అయింది. కాబట్టి డిప్యూటీ మేయర్ జనరల్ కేటగిరీ అభ్యర్థికి ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికే కేటాయించాలని ఓ వర్గం నాయకులు పట్టుబడుతున్నారు. బీసీలకు ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. 50 డివిజన్లలో 34 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ నుంచి దాదాపు పది మంది డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తుండటం గమనార్హం. ఆ ఆరుగురిలో ఎవరు? డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్ష, కార్యదర్శులు కమర్తపు మురళి, చావా నారాయణరావుతోపాటు పోట్ల శశికళ, కొత్తపల్లి నీరజ, శీలంశెట్టి రమ, ప్రశాంతలక్ష్మి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పురుషులకు కేటాయిస్తే చావా నారాయణరావు లేదా కమర్తపు మురళీలలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మేయర్ పురుషుడు కావడంతో డిప్యూటీ మేయర్‌ను మహిళలకు కేటాయిస్తే వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని పార్టీలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే పోట్ల శశికళ లేదా నీరజతో పాటు శీలంశెట్టి రమలలో ఒకరికి ఇస్తే బాగుంటుందని పార్టీలోని కొందరు నాయకులు సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం. మేయర్‌ను ఎంపిక చేయడం కంటే డిప్యూటీ నియామకం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై ఆ పార్టీ నాయకులతో కూడా ఒకమారు చర్చించినట్లు సమాచారం. ఫ్లోర్‌లీడర్ల నియామకంలో విపక్షాలు.. ఈనెల 15న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం, ప్రమాణ స్వీకారం, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్ల ని యామకం జరుగుతుండటంతో ప్రతిపక్షాలు తమ పక్షం తరఫున ఫ్లోర్‌లీడర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది కార్పొరేటర్లు గెలుపొందారు. వీరిలో వడ్డెబోయిన నరసింహారావు, నాగండ్ల దీపక్‌చౌదరి, యర్రం బాలగంగాధర్ తిలక్, పాలడు గు పాపారావులతోపాటు ఆరుగురు మహిళలున్నారు. గతంలో కౌన్సిల్లో పనిచేసిన అనుభవం ఉన్న వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్తిలక్లలో ఒకరికి ఫ్లోర్‌లీడర్ పదవి అప్పగించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. ఫ్లోర్‌లీడర్ పదవి త నకూ కావాలని దీపక్‌చౌదరి తన అనుచరుల ద్వా రా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్లు తెలిసింది. సీపీఐ నుంచి క్లెమెంట్, సక్కుబాయిలు గెలుపొందగా.. క్లెమెంట్కే ఫ్లోర్‌లీడర్ బాధ్యతలు అప్పగించనున్నారు. సీపీఎం నుంచి గెలుపొందిన వారిలో అఫ్రోజ్ సమీనా, యర్రా శైలజలు ఇద్దరూ మహిళలే కావడంతో గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమీనాకు ఇవ్వాలా.. లేదా శైలజకు ఇవ్వాలా..? అనే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన దోరేపల్లి శ్వేత, సలువాది వెంకయ్యల్లో ఒకరిని ఎంపిక చేస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.