పోతు బొప్పాయి.. కాయలు కాసిందోచ్!
బొప్పాయి చెట్లలో ఆడ, మగ ఉంటాయి. ఆడచెట్లు మొగిలో కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ మగ చెట్లు కాయలు కాయడం విశేషం. పెదగొల్లగూడెం గ్రామానికి చెందిన గొంది ఈశ్వరరావు పెరట్లోని బొప్పాయి చెట్లలో ఓ పోతు చెట్టు ఉంది. సాధారణంగా పోతు చెట్టుకు కాడలకు పూర్తిగా పూలు ఉంటాయి. కానీ పూలకు బదులు కాడలకు చివరన కాయలు ఉన్నాయి. 28 కాడలు తీగలాగా కిందకు వేలాడి కాయలు కాయడం ఆసక్తి గొల్పుతోంది. – వాజేడు