కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పారా మెడికల్ ఆరోగ్య కార్యకర్తలను క్రమబద్దీకరించేందుకు తనవంతు కృషి చేస్తామని ఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమనాయుడు, దేవప్రసాద్ తెలి పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ జిల్లా కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో ఎన్జీఓ సంఘం నాయకులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించారు. వైద్యఆరోగ్య శాఖలో తాము 12 సం వత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నామని తెలిపారు. 2002లో డీఎస్సీ ద్వారా రోస్టర్ పద్థతిలో తమను జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారన్నారు. అప్పటి నుంచి ఎలాంటి భత్యాలు లేకుండా గ్రాస్ శాలరీతో అదీ అరకొరగా తీసుకుంటున్నామని వారు వాపోయారు. కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. అయితే 2002లో నియమితులైన కాంట్రాక్ట్ పంచాయతీ రాజ్ కా ర్యదర్శులను, విద్యుత్, ఆర్టీసీ, ఇతర సంక్షేమ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపది కన తీసుకున్న ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించారని పేర్కొన్నారు.
తమను కూడా క్రమబద్దీకరించి న్యాయం జరిగేలా చూడాలని కోరా రు. దీనిపై ఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు స్పందిస్తూ ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఎన్జీఓ సంఘం నాయకులను కలిసిన వారిలో శరవ ణ, మురళిబాబు, భాస్కర్, అయ్యప్పన్, చంద్రశేఖర్, సుబ్రమణ్యం తది తరులు ఉన్నారు.