paramesvara
-
దేవుడి కంటే పెద్దది
‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’ అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు. సంతానం లేని ఒక వ్యక్తి పరమేశ్వరుడిని ప్రార్థించి, ఆయన కృపతో సంతానాన్ని పొందాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు పాలు తాగక బాధపెడుతుంటే, పరమేశ్వరుని తిరిగి ఇలా ప్రార్థించాడు. ‘‘దేవా! పుత్రుణ్ణి ఇచ్చావు. కాని వాడు పాలు తాగడం లేదు. ఎలా?’’ అని! పరమేశ్వరుడు ప్రత్యక్షమై అలాగే వాడు పాలు తాగుతాడని వరమిచ్చాడు. పిల్లాడు పాలు తాగడం మొదలు పెట్టాడు. పెరిగి అల్లరి పిల్లవాడయ్యాడు. తండ్రి మళ్లీ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు బాలుడు అల్లరి మానతాడని వరమిచ్చాడు. ఈసారి వాడు మరీ మౌనంగా ఉండటం మొదలు పెట్టాడు. దాంతో తండ్రికి భయం వేసి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుని కృపతో తిరిగి మామూలయ్యాడా బాలుడు. అలా చాలాసార్లు ప్రార్థించిన తర్వాత వాడు పెద్దవాడై, ఉద్యోగాన్ని సంపాదించుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈసారి వాడికి సంతానం లేదు. తండ్రి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. ‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’ అని. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు. అటువంటి ప్రార్థనలకు అంతు ఉండదు. ఉన్న దానితో తృప్తి కలగదు. అందుకే మన పూర్వీకులు ముందే చెప్పారు. రూపాయి ఉన్నవాడికి వంద కావాలి. వంద ఉన్నవాడికైతే వేయి కావాలి. వేయి ఉన్న వాడికి లక్ష కావాలి. లక్ష ఉన్నవాడికి రాజు కావాలని ఉంటుంది. రాజుకు కుబేరుడు కావాలనీ, కుబేరుడికి ఇంద్రుడు కావాలనీ, ఇంద్రుడికి బ్రహ్మ కావాలనీ, బ్రహ్మకు విష్ణువు కావాలనీ, విష్ణువుకు శివుడు కావాలనీ... ఇలా కోరికలకు అంతెక్కడ?’’ పర్వతం పెద్దది. దానికంటే పెద్దది సముద్రం. దానికంటె పెద్దది ఆకాశం. దానికంటె పెద్దవాడు దేవుడు. దేవుడికంటె పెద్దది కోరిక. అసంతృప్తి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కోసమే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఇక కోరికలే ఉండవు. – శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి -
కాంగ్రెస్‌లో కోల్డ్ వార్
డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్న పరమేశ్వర సీఎంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి ఆ పదవి ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న సిద్ధు తన పరిధిలో లేదంటూ సెలైంట్ పట్టువీడని పరమేశ్వర మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్‌లో శీతల సమరం ఉధృతమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలోనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనుకుంటున్న తరుణంలో, పరమేశ్వర ఇప్పటి నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఆయన అనుకున్నట్లుగా సీఎం స్పందించడం లేదు. అన్నిటికీ ఆయన అధిష్టానం వైపు చూపిస్తున్నారు. ‘నాదేముంది. ఏదైనా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి’ అని పదే పదే ఆయన చెబుతుండడం పరమేశ్వరకు కంపరం పుట్టిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం తొమ్మిది మందే గెలవడంతో అధిష్టానం వద్ద సీఎం పలుకుబడి తగ్గుతుందని పరమేశ్వర అంచనా వేశారు. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఇన్ని స్థానాలు గెలవలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కనుక సిద్ధరామయ్యే కొంత నయమని అధిష్టానం అంచనాకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవిని సీఎం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల రెండు అధికార కేంద్రాలు ఏర్పడుతాయని, తద్వారా ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోతారని భావిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లోని పాత తరం వారంతా సిద్ధరామయ్యను అంత సులభంగా కలుసుకోలేక పోతున్నారు. సీఎం పూర్వాశ్రమంలో జనతా పరివార్‌కు చెందిన వారు. ఆ పరివార్‌లో ఉన్న మంత్రులకే ఆయన విలువ ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనికి విరుగుడుగాా ఆది నుంచీ కాంగ్రెస్‌లో ఉంటున్న వారు పరమేశ్వరకు మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశా వచ్చే నెలలో జరుగనున్న శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల వరకు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేదు. పునర్వ్యవస్థీకరణ వాయిదా పడే కొద్దీ మంచిదనే అభిప్రాయం సీఎంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడినందున, సీఎంను ఆదేశించే స్థితిలో లేదు. -
పోటా పోటీ
ఎగువ సభ అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్ నేతలు క్యూ మొత్తం 11 స్థానాలు ఖాళీ 27న నోటిఫికేషన్ వచ్చే నెల 20న ఓటింగ్, 24న ఫలితాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో అ భ్యర్థిత్వాలను దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. శాసన సభ నుంచి శాసన మండలికి ఏడుగురిని, రాజ్యసభకు నలుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయి. 122 మంది సభ్యులు కలిగిన కాంగ్రెస్ శాసన మండలికి సునాయాసంగా నలుగురిని పంపగలుగుతుంది. రాజ్యసభకు కూడా ఇద్దరు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. శాసన మండలి అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్‌లో సుమారు వంద మంది పోటీ పడుతున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తొలి వరుసలో ఉన్నారు. ఇంకా హెచ్ఎం. రేవణ్ణ, గుర్రప్ప నాయుడు, మంజులా నాయుడు, సీఎం. ఇబ్రహీం, వీఆర్. సుదర్శన్, బీఎల్. శంకర్ లాంటి వారు కూడా పోటీ పడుతున్నారు. షెడ్యూల్ విడుదల శాసన మండలిలో వచ్చే నెల 30వ తేదీకి ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు మంగళవారం ఎన్నికల కార్యక్రమం విడుదలైంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం...ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ మూడో తేది వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నాలుగున పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 6న తుది గడువు. అవసరమైతే అదే నెల 20న ఎన్నికలు నిర్వహిస్తారు. 24న ఓట్ల లెక్కింపు చేపడతారు. కర్ణాటక ఆగ్నేయ పట్టభద్రుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ ఏహెచ్. శివయోగి స్వామి, బెంగళూరు ఉపాధ్యాయుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టన్నలు వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కర్ణాటక ఈశాన్య ఉపాధ్యాయ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శశిల్ జీ. నమోషి, కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన మోహన్ ఏ. లింబికాయ్లు ఇదివరకే రాజీనామా చేశారు.