మృత్యువే గెలిచింది...
అప్పుడు మరణాన్ని జయించి...ఇప్పుడు ఓడిపోయింది
నరకయాతన అనుభవిస్తూ17 రోజుల తరువాత ఊపిరి వదిలిన పారమ్మ
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
బాడంగి: పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన పారవృు్మ మత్యువుతో పోరాడి ఓడిపోయింది. దాదాపు 17 రోృలు మత్యువుతో పోరాడిన పారమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. బాడంగి మండలం పాల్తేరుకు చెందిన పారమ్మ పుష్కరాల తొలిరోజునే పుణ్యస్నానం చేద్దామని రాజమండ్రి బయల్దేరింది. అయితే పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటలో కిందపడి తీవ్రంగా గాయపడింది. ముందు చనిపోయిందని భావించిన పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తెలివి రాగా అక్కడ నుంచి జీఎస్ఎల్ ఆస్పత్రికి మార్చారు.
ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగిపోవడంతో కూర్చోలేక, నిలుచోలేక ఆమె నరకయాతన అనుభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు చిన్నగా మాట్లాడేదని దీంతో ఆశలు పెంచుకున్నామని అవి అడియాసలు అయ్యాయని, నాలుగు రోజుల కిందట రక్తమార్పిడి చేయగా శరీరంలో మార్పు వచ్చి చనిపోయిందని కుమారుడు సింహాచలం తెలిపాడు. ప్రభుత్వం తవ*ుకు ’25 వేల ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. తొక్కిసలాటలో చావు నుంచి తప్పించుకున్నందుకు ఎంతో సంతోషించామని కానీ చివరకు ఇలా చనిపోతుందని అనుకోలేదని కుమారుడు, కుమార్తె కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. పారమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో పాటు మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. పారవృు్మ మతి విషయం తెలిసి ఆ కుటుంబం విషాదంతో మునిగిపోయింది.