breaking news
Parcel Services
-
అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు బంద్
న్యూఢిల్లీ: అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ప్రకటించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. 100 డాలర్లకంటే ఎక్కువ విలువైన బహుమతులను అమెరికా భూభాగంలోకి డెలివరీ చేసేందుకు తొలుత ఇండియాపోస్ట్ తాత్కాలిక విరామం ఇవ్వగా తాజాగా అన్ని కేటగిరీల పార్శిళ్లను అమెరికాకు డెలివరీ చేయడం ఆపేసింది. ‘‘ఆగస్ట్ 22న జారీచేసిన బహిరంగ నోటీస్ ప్రకారమే అమెరికాకు పార్శిళ్ల డెలివరీను ఆపేశాం. అయితే అమెరికా కస్టమ్స్ శాఖ విడుదలచేసిన తాజా నిబంధనల్లో స్పష్టత కొరవడింది. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో అమెరికాకు లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతుల వంటి ఎలాంటి వస్తువులను పంపడం సమర్థనీయం కాదు. అందుకే అన్నిరకాల పార్శిళ్లను అమెరికాకు పంపడం నిలిపేస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అమెరికా విభాగాల స్పందనకు అనుగుణంగా వీలైనంత వరకు త్వరగా సేవల పునరుద్ధరణకు కట్టుబడిఉన్నాం’’అని ఇండియాపోస్ట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్‌పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్మెంట్స్పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్‌తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు. -
మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఓలా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ఓలా తాజాగా ఓలా పార్సల్ సేవలను బెంగళూరులో ప్రారంభించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇందుకోసం కంపెనీ వినియోగించనుంది. దశలవారీగా పార్సల్ సర్వీ సులు ఇతర నగరాల్లో పరిచయం చేయనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చార్జీ వసూలు చేస్తారు. 5 కిలోమీటర్లపైన దూరాన్నిబట్టి 20 కిలోమీటర్ల వరకు చార్జీ రూ.100 దాకా ఉంది. -
విషాద ఘటన: నాన్‌స్టాప్ డెలివరీలతో కుప్పకూలాడు
పండుగ సీజన్లను క్యాష్ చేసుకోవడం ఈ-కామర్స్ సంస్థలకు అలవాటైన పనే. అదే సమయంలో డెలివరీ ఏజెంట్లకు కూడా చేతి నిండా పని ఉంటుంది కూడా. అయితే ఆ పని హద్దులు దాటిపోతే. కంపెనీ ఇచ్చే టార్గెట్‌ను రీచ్ కావాలనే ఆత్రుతతో హక్కులు లేని గిగ్ సెక్టార్ ఉద్యోగులు తీవ్రంగా పని చేస్తుంటారు. సరిగా ఇలాంటి ఘటనే ఓ డెలివరీ ఏజెంట్ ప్రాణం తీసింది. ఆ డెలివరీ ఏజెంట్.. ఆర్డర్లను కస్టమర్లకు అందించడానికి యత్నించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేశాడు. రోజుకు 14 గంటలపాటు ఒక వారం రోజులు పని చేశాడు. విరామం లేకుండా పని చేసే సరికి బాడీ అలిసిపోయింది. చివరకు ఆ వ్యాన్లోనే హ్యాండిల్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. యూకేలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న వారెన్ నోర్టన్ (49).. డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ల డెలివరీ చేస్తున్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా తన వ్యాన్‌ను ఉపయోగించుకుంటున్నాడు. అయితే.. బ్లాక్ ఫ్రైడే తరుణంలో విపరీతమైన ఆర్డర్లు రావడంతో విరామం ఎరుగకుండా పని చేశాడు. రోజులో 14 గంటలు ఆర్డర్లు డెలివరీ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అలా ఓ వారంపాటు డెలివరీ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం వ్యానులో డెలివరీకి వెళ్లిన ఆయన.. అలాగే స్టీరింగ్‌పై కుప్పకూలి పోయాడు. అది గమనించిన ఓ కస్టమర్.. డోర్ తెరవడంతో సరాసరి రోడ్డు మీదకు పడిపోయాడు. వెంటనే సీపీఆర్ ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. సదరు కంపెనీకి సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పని ఒత్తిడితోనే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరిమితికి మించి పని చేయడంతోనే అతను చనిపోయినట్లు ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు చెప్తున్నారు. అయితే.. ఆ కంపెనీ మాత్రం పని ఒత్తిడి ఆరోపణలను కొట్టేసింది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటామని చెబుతూ.. వారెన్ నోర్టన్ మృతిపై మొక్కుబడిగా ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిళ్ల వీడియో వైరల్: మండిపడుతున్న యూజర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సోషల్‌మీడియాలో మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచాయి. వీటి ఆన్లైన్ డెలివరీ పార్సిల్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన యూజర్లు అయ్యో.. నా పార్సిల్ .. నా ఫోన్, నా ల్యాప్‌టాప్ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో రీట్వీట్టు, కమెంట్లతో హోరెత్తి పోతోంది. విషయం ఏమిటంటే.. రైలు బోగీలోంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్‌ను, ప్యాకెట్ల,అట్టపెట్టెలను అన్లోడింగ్ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. నిర్లక్క్ష్యంగా, కనీస జాగ్రత్త లేకుండా వాటిని విసిరి పారేస్తున్న వైనం వినియోగదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందుకేనా మా దగ్గర అదనంగా 29 రూపాయలు అప్పనంగా వసూలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు. రకరకాల కమెంట్స్ ట్విటర్లో వైరలవుతున్నాయి. ‘3 లక్షల రూపాయల విలువైన నా ఆసుస్ గేమింగ్ ల్యాప్‌టాప్ అందులోనే ఉందనుకుంటా’ గోవిందా అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, ఖాళీ పెట్టెల్లాగా అలా విసిరేస్తున్నారేంటిరా బాబూ అని మరొకరు, ఇక ఇవాల్టితో ఆన్లైన్ షాపింగ్ బంద్ ఇంకొకరు కమెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ సమయంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే వీడియోపై అటు అమెజాన్‌గానీ, ఇటు ఫ్లిప్కార్ట్కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Amazon & Flipkart parcels 😂pic.twitter.com/ihvOi1awKk — Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022 There is my Asus gaming laptop 💻 worth 3lacks I think it's right there 🫣🫣 pic.twitter.com/6Tu12IWwkP — Varun (@Varun11171) August 29, 2022 Mean while #Flipkart 29rs for secured packaging so it doesn't get damage 🤣 pic.twitter.com/8dpUCXAadH — Poco Lover (@occuppymoonNow) August 29, 2022 -
కరోనా: కదలనున్న పార్సిల్ రైళ్లు..
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఈ నెల 22 నుంచి రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కూరగాయల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసేందుకు రైల్వే శాఖ కొన్ని పార్సిల్ వ్యాన్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీ–గువాహటి, ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కళ్యాణ్, ఢిల్లీ–హౌరా, చండీగఢ్–జైపూర్, మోగా–ఛంగ్సారి మార్గాల్లో తిరుగుతాయి. ఈ రైళ్లలో కూరగాయలు, పాల ఉత్పత్తులు, మందులు, చేపలు వంటివి రవాణా అవుతాయని అధికారులు చెప్పారు. (కరోనా : 7లక్షలకిచేరువలో కేసులు) చదవండి: నన్ను క్షమించండి -
రేపటి కోసం నిరీక్షణకు చెల్లు
పంపిన రోజే పార్శిల్ ఇంటికి.. పోస్టల్ శాఖ సరికొత్త సేవలు ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో పార్శిల్ సేవలు మరింత వేగవంతమైంది. పార్శిల్ పంపించిన రోజే డెలివరీ అయ్యే సరికొత్త సేవలను పోస్టల్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. పోస్టల్ సర్వీసెస్ బోర్డు సభ్యుడు జీ. జాన్ సామ్యూల్ సేమ్‌డే పార్సిల్ డెలవరీ వ్యాన్లను చిక్కడపల్లి కమ్యూనిటీ హాల్‌వద్ద బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరిధిలో.. ప్రస్తుతం సేమ్‌డే పార్శిల్ డెలవరీ సేవలను హైదరాబాద్ జీపీవో, హుమాయూన్‌నగర్, హిమాయత్ నగర్, మలక్‌పేట, సరూర్‌నగర్, మల్కాజిగిరి, హిమ్మత్ నగర్ పోస్టల్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సేవలు అందుబాటులో గల లోకల్ పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా పార్శిళ్లను పంపవచ్చు. అదేరోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సంబంధిత చిరునామాలకు సిబ్బంది డెలివరీ చేస్తారు. పార్శిల్ బరువు 500 గ్రాములకు సర్వీస్ చార్జీ రూ.19, పోస్టల్ రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 17. మొత్తం రూ. 36. ఈ సేవలపై టోల్ ఫ్రీ నంబర్ 1800 925 3925. మెరుగైన పోస్టల్ సేవలు... సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్ సేవలు అందించేందుకు దేశంలోని మరో నాలుగు మహానగరాల్లో ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు జాన్ సామ్యూల్ వెల్లడించారు. సేమ్‌డే పార్శిల్ డెలవరీ సేవలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఢిల్లీ, కలకత్తాలో ఆటోమెటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చామని, త్వరలో హైదరాబాద్ తోపాటు, చెన్నై, బెంగళూర్, ముంబయి మహానగరాల్లో కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. త్వరలో డిజిటల్ పోస్టాఫీసు... సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో డిజిటల్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ-కామర్స్ సేవలను విస్తృతపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, హైదరాబాద్ ప్రాంతీయ పోస్టల్ జనరల్ ఎం ఎలిషా, పోస్టల్ సర్వీసెస్ డెరైక్టర్ మరియమ్మ థామస్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ సూరింటెండెంట్ శిల్పారావు తదితరులు పాల్గొన్నారు.