pardasaradi
-
నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచాడు
ధర్మవరం: ‘నమ్మి ఆయన్ను గెలిపిస్తే.. మా కుటుంబాన్ని నట్టేట ముంచాడు. ఆయన వ్యక్తిగత స్వార్థానికి చేనేత వ్యవస్థ సర్వ నాశనమైపోయింది’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై ఆ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గడ్డం పార్థసారథి నిప్పులు చెరిగారు. బుధవారం స్థానిక లక్ష్మీచక్రవర్తి థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సూరి వైఖరికి నిరసనగా తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన జిల్లా కార్యదర్శి పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో వరదాపురం సూరి విజయానికి తమ గడ్డం ఫ్యామిలీ మొత్తం శ్రమించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేనేత వర్గానికి చెందిన తనపై వ్యక్తిగత కక్షసాధింపులకు దిగాడని, ఆయన టార్గెట్ కారణంగా చేనేత వ్యవస్థ మొత్తం నిర్వీర్యమై పోయిందని తెలిపారు. దీనికి తోడు టీడీపీలో తాము చేరినప్పటి నుంచి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లోనే రాజీనామా చేయాల్సి ఉండగా, ఇంత కాలం సూరిలో మార్పు వస్తుందని ఎదురు చూసినట్లు వివరించారు. సూరి నియంతృత్వ ధోరణి భరించలేక టీడీపీలో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును వెల్లడిస్తానని చెప్పారు. -
చంద్రబాబు ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి
-
29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు..?
-
నంబర్‌వన్ విలన్ చంద్రబాబే
-
దేవినేని ఉమ పెద్ద బ్రోకర్: పార్ధసారథి
సాక్షి, కృష్ణా జిల్లా: పేపర్ మిల్లులతో మంత్రి దేవినేని ఉమ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే గిట్టుబాటు ధర రావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్ధసారథి విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి పేపర్ మిల్లు యాజమాన్యాలను దేవినేని ఉమ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమ పెద్ద బ్రోకర్లా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబునాయుడుకు కాంట్రాక్టర్‌కు మధ్య దేవినేని బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలని బ్రోకర్లను చేసి, రైతులను దోపిడీ చేయించేందుకే 498 జీఓ జారీ చేయించారని మండిపడ్డారు. దుర్భుద్దితోనే మంత్రి దేవినేని ఉమ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పత్తి రైతులు కూడా కనీస ధరలకు దూరమయ్యారని అన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు సీసీఐతో పత్తి కొనుగోళ్లు చేయించడం లేదని ప్రశ్నించారు. -
65 సభ్య దేశాలకు విత్తనాల ఎగుమతి
కర్నూలు (అగ్రికల్చర్): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేద్దామని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రా లకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ప్రమాణాలకు అనుగుణంగా విత్తన ధ్రువీకరణ చేసే కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటైందని చెప్పారు. ఓఈసీడీలో 65 దేశాలకు సభ్యత్వం ఉందని, అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సర్టిఫికెట్తో ఈ దేశాలన్నింటికీ విత్తనాలను ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విత్తన కంపెనీల ప్రతినిధులు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అధికారులు, రైతులు హాజరయ్యారు. పార్థసారథి మాట్లాడుతూ అంతర్జాతీయ విత్తన మార్కెట్లో భారతదేశ వాటా ఒక్క శాతం మాత్రమే ఉందని, దీన్ని కనీసం 10 శాతానికి పెంచుకునేందుకు అంత ర్జాతీయ నాణ్యతాప్రమాణాలకు అనుగు ణంగా విత్తనోత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓఈసీడీ ప్రమాణాలకు అను గుణంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను వాడటం వల్ల 20 నుంచి 30 శాతం వరకు దిగుబడి పెరుగుతుందని చెప్పారు. -
‘నంద్యాల సభ చూసి భయంతో రోడ్లెక్కుతున్నారు’
విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభను చూసి భయంతో టీడీపీ నేతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత కె. పార్థ సారథి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలుకు ఇచ్చిన 28 హామీలలో ఎన్ని చేసారో జగన్ అడిగినా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారని అన్నారు. రాజకీయ స్వార్దం కోసం, ఓట్ల కోసం రూ. 1200 కోట్లను నంద్యాలకు కేటాయించారని చెప్పారు. సభ్యతా, సంస్కారం గురించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలకు దమ్ము, నైతిక విలువలు ఉంటే ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.