స్కూల్ అంటే భయం పోయింది!: కేటీఆర్
ఆయన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్. అయితేనేం ఆ మంత్రిగారికి ఇటీవల ఓ అగ్ని పరీక్ష ఎదురైంది. స్వయంగా తాను మంత్రి అయినప్పటికీ.. ఓ ప్రైవేట్ స్కూలు నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆయనలో కాస్త టెన్షన్ మొదలైంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై అవాక్కులు చవాక్కులు పేల్చుతూ వారి ప్రశ్నలకు ధీటైన జవాబులిచ్చే ఆ మంత్రిగారు తనకు కంగారుగా ఉందన్న విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు.
ఆ మంత్రి మరెవరో కాదు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్. అసలు విషయం ఏంటంటే.. మంత్రి కేటీఆర్ కూతురికి ప్రస్తుతం ఎనిమిదేళ్లు. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఉందని, అందుకు హాజరుకావాలంటూ స్కూలు యాజమాన్యం కేటీఆర్ కు ఫోన్ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబులు చెప్పడం, ఎన్నికలల్లో ప్రచారం చేయడం కంటే ఇప్పుడే తనకు కంగారు ఎక్కువైందంటూ మంత్రిగారు ట్వీట్ లో రాసుకొచ్చారు. తన కడుపులో సీతాకోకచిలుకలు పరుగెడుతున్నాయంటూ టెన్షన్ లోనూ తనదైనశైలిలో ట్వీట్ చేశారు.
రాష్ట్ర మంత్రి అయితేనేం పేరెంట్ గా మాత్రం ఇలాంటి మీటింగ్స్ కు హాజరుకావాలని ఆయనకు తెలుసు. అందుకే స్కూలువారు చెప్పినట్లుగానే పేరెంట్-టీచర్స్ మీటింగ్కు వెళ్లి.. కూతురి చదువు ఎలా సాగుతుంది ఏంటి అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూలు నుంచి తన కుతురి చదువు, క్రమశిక్షణ అంశాలపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో మంత్రిగారు కాస్త కూల్ అయ్యారు. ఈ విషయాన్ని మీటింగ్ తర్వాత మరో ట్వీట్లో రాసుకొచ్చారు. తాను ఎంతో టెన్షన్ పడ్డానని, అయితే ఊహించినంత కంగారు అక్కర్లేదు. ఇక తరచుగా స్కూలుగా రమ్మన్నా వచ్చేస్తానని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
More butterflies in my stomach to attend my 8 yr old daughter's parent-teachers meeting than for my assembly debates or elections!! Hmmm